‘దేశం’ ఎమ్మెల్యేలకు తలనొప్పి
విజయవాడలోని కాల్వగట్ల ఆధునీకరణ, సుందరీకరణ పేరుతో ఇరిగేషన్, నగరపాలక సంస్థ అధికారులు కాల్వగట్ల వాసులకు నోటీసులివ్వడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల నగరంలో పర్యటించి కాల్వగట్లను సుందరీకరించాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్ అధికారులు బుడమేరు మధ్య కట్ట, రైవస్ కెనాల్, బందరు కాల్వలకు రెండువైపులా నివాసముంటున్న వారి గుడిసెలు, దుకాణాలను తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేశారు. గుణదల, పటమట, రామవరప్పాడు, బుడమేరు కట్టపై ఉంటున్న కొంతమంది పేదలకు నోటీసులివ్వడంతో […]
విజయవాడలోని కాల్వగట్ల ఆధునీకరణ, సుందరీకరణ పేరుతో ఇరిగేషన్, నగరపాలక సంస్థ అధికారులు కాల్వగట్ల వాసులకు నోటీసులివ్వడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల నగరంలో పర్యటించి కాల్వగట్లను సుందరీకరించాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్ అధికారులు బుడమేరు మధ్య కట్ట, రైవస్ కెనాల్, బందరు కాల్వలకు రెండువైపులా నివాసముంటున్న వారి గుడిసెలు, దుకాణాలను తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేశారు. గుణదల, పటమట, రామవరప్పాడు, బుడమేరు కట్టపై ఉంటున్న కొంతమంది పేదలకు నోటీసులివ్వడంతో ప్రజలు, విపక్షాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్లు తొలగిస్తే సహించేదిలేదని, వారికి అండగా నిలబడతామని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఇరిగేషన్ మంత్రి సొంత జిల్లాలోనే పేదలకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, జిల్లాలో 25 వేలు, నగరంలో 10 వేల కుటుంబాలు కాల్వగట్లపై పూరిగుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. సుమారు 40 ఏళ్లుగా నివస్తున్న వారిని తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేయడంతో కంగుతిన్న పేదలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్ లకు పెద్ద తలనొప్పిగా మారింది. తమను ఇళ్లు ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి వెళ్తామంటూ ప్రజలు ప్రశ్నించడంతో నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. .