మాట‌ల సీఎంను కాను...ఇక‌ చేత‌లే: కేసీఆర్‌

విద్య‌, నిరుద్యోగులు, గృహ నిర్మాణం, విద్యుత్ వంటి అనేక అంశాల‌ను కేసీఆర్ ప్ర‌స్తావించారు. మే నెల నుంచి పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ తెలిపారు. నిరుద్యోగులు కాస్త ఓపిక పట్టాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ బ‌హిరంగ‌స‌భ‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు మాట్లాడుతూ… వచ్చే ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా కేజీ టు పీజీ విద్య అమలు చేస్తామని […]

Advertisement
Update:2015-04-27 11:30 IST
విద్య‌, నిరుద్యోగులు, గృహ నిర్మాణం, విద్యుత్ వంటి అనేక అంశాల‌ను కేసీఆర్ ప్ర‌స్తావించారు. మే నెల నుంచి పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ తెలిపారు. నిరుద్యోగులు కాస్త ఓపిక పట్టాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ బ‌హిరంగ‌స‌భ‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు మాట్లాడుతూ… వచ్చే ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా కేజీ టు పీజీ విద్య అమలు చేస్తామని చెప్పారు. రానున్న మే నెల నుంచి రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్‌ అందిస్తామని, తెలంగాణలో కరెంట్‌ కోతలనేవే లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ సొమ్ము ఆంధ్రాకు పోతోందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు మిగులు బడ్జెట్‌ ద్వారా అది రుజువైందని తెలిపారు.అందుకే ఇన్ని ప‌నులు చేయ‌గ‌లుగుతున్నామ‌ని ఆయ‌న అన్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి కిరికిరి నాయుడు అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రుణమాఫీపై మాట తప్పారని, తాను రుణమాఫిపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అన్నారు. త్వరలో పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తానని కేసీఆర్‌ తెలిపారు. ఇక మాటలుండవని, అన్నీ చేతలే ఉంటాయని వ్యాఖ్యానించారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు చాకులా చేస్తున్నారని ప్రశంసించారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, తెలంగాణను సశ్యశ్యామలం చేస్తామని అన్నారు. రాబోయే మూడున్నరేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
Tags:    
Advertisement

Similar News