లోకేష్ కోసం జూ.ఎన్టీఆర్ పై వేటు..?
తెలుగుదేశం బరువు బాధ్యతలను చంద్రబాబు తనయుడు లోకేష్ పంచుకోవాలనుకుంటున్నారు. దీనికి అనుకూలంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం హెరిటేజ్ బోర్డులో మెంబర్‌గా ఉన్న ఆయన రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉండాలని భావిస్తున్నందున రెండు పడవల్లో కాలు మంచిది కాదని హితులు చెబుతున్నారు. అందుచేత హెరిటేజ్ నుంచి ఆయన బయటకు రావడానికే నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. తన మార్కు చూపించడానికి, తండ్రి తర్వాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి తాను క్రియాశీల రాజకీయాల్లోకి ఇప్పటి నుంచే రావడం తప్పనిసరని భావిస్తున్నారు. ఒకవైపు తాను ఇప్పుడే […]
Advertisement
తెలుగుదేశం బరువు బాధ్యతలను చంద్రబాబు తనయుడు లోకేష్ పంచుకోవాలనుకుంటున్నారు. దీనికి అనుకూలంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం హెరిటేజ్ బోర్డులో మెంబర్‌గా ఉన్న ఆయన రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉండాలని భావిస్తున్నందున రెండు పడవల్లో కాలు మంచిది కాదని హితులు చెబుతున్నారు. అందుచేత హెరిటేజ్ నుంచి ఆయన బయటకు రావడానికే నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. తన మార్కు చూపించడానికి, తండ్రి తర్వాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి తాను క్రియాశీల రాజకీయాల్లోకి ఇప్పటి నుంచే రావడం తప్పనిసరని భావిస్తున్నారు. ఒకవైపు తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రానని, పార్టీకి కొమ్ముకాసిన కార్యకర్తలంతా ఆర్థికంగా నిలబడిన తర్వాత మాత్రమే తాను ఆ విషయం ఆలోచిస్తానని పైకి చెబుతున్నప్పటికీ లోలోన ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన తండ్రి చంద్రబాబు అనుసరిస్తున్న హైటెక్ విధానాలు పాటిస్తూనే తనదైన శైలిలో పార్టీని నడిపించాలని ఆయన భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌కు ధీటుగా తన కుమారుడ్ని తయారు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ కార్యాలయానికి రావడం దాదాపు మానేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులంతా పార్టీకి సంబంధించి ఏ విషయాలు మాట్లాడాలన్నా లోకేష్‌బాబునే కలవాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ కార్యాలయంలో లోకేష్‌కి పీఠం వేసి కూర్చోబెట్టేశారు. నెమ్మదిగా రాష్ట్రం మొత్తం పార్టీ అంటే లోకేష్….. అన్నట్టుగా తయారు చేస్తున్నారు. లోతు గుండె, ముందుచూపు ఎక్కువగా గల చంద్రబాబు తన తనయుడికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఎప్పటి నుంచో జాగ్రత్త పడడం మొదలెట్టారు. ఇందులో భాగంగానే హరికృష్ణను, ఆయన తనయుడు, మంచి ఛార్మ్‌లో ఉన్న ఎన్టీఆర్‌ను పక్కన పెట్టే ఏర్పాటు చేసి తెర మరుగు చేశారు. ఆయన సినిమాలు కూడా సక్సెస్ కాకుండా కార్యకర్తలకు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల ముందు నుంచే జరుగుతున్న ఈ భాగోతం కారణంగానే ఎన్టీఆర్ సినిమాలు ధియేటర్లలో ఎక్కడా ఆడిన సందర్భాలు లేకుండా పోయాయి. ఎన్టీఆర్ సినిమాలు విజయవంతమయితే ఆ ప్రభావం అంతోఇంతో ఉండి ఆయన జనం నోళ్ళలో నాని నాయకుడిగా ఎదగడానికి కారణమవుతుందని, అసలు జనం నోళ్ళలో లేకుండా చేస్తే తన తనయుడికి అది కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సక్సెస్ అయ్యారని చెప్పాలి
ఇక తన తనయుడు లోకేష్‌ని నాయకుడిగా చేయాలంటే అతనికి సీనియర్ నాయకుల బాసట కావాలి. ఇందుకు అనుగుణంగా ప్రొమోషన్ కార్యక్రమం మొదలు పెట్టారనే చెప్పాలి. ముందుగా లోకేష్‌ను కార్యకర్తల ఓదార్పు పేరుతో జిల్లాల్లో తిప్పుతున్నారు. అక్కడ ప్రతిచోటా జిల్లా దేశం నాయకులు ఆయనకు సన్నిహితమవుతారు. దీనివల్ల భవిష్యత్‌తో లోకేష్ రాకకు ఇది తోడ్పడుతుందనడం నిజం. ఇప్పుడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నాయకులు ఆయననే కలవడం… జిల్లాల పర్యటనల్లో అక్కడి నాయకులు, కార్యకర్తలు సన్నిహితమవడం వల్ల లోకేష్‌కు పట్టం కట్టడానికి ఎలాంటి అడ్డంకులు రావు. ఈ వ్యూహంతోనే చంద్రబాబు పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement