నెల్లూరు జిల్లాను అందంగా మారుద్దాం: వెంకయ్య పిలుపు
నెల్లూరు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెక్స్ట సదస్సులో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మురికినీరు, సాగునీటి సమస్య అధికంగా ఉందని ముందు దీన్ని అధిగమించాలని ఆయన అన్నారు. హఢ్కో నిదుల మంజూరుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, తనవంతుగా కూడా సాయం అందేలా చూస్తానని చెప్పారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, ప్యాబ్రికేషన్ హౌస్‌లను వెంకటాచలం దగ్గర నిర్మిస్తామని, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరులో […]
Advertisement
నెల్లూరు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెక్స్ట సదస్సులో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మురికినీరు, సాగునీటి సమస్య అధికంగా ఉందని ముందు దీన్ని అధిగమించాలని ఆయన అన్నారు. హఢ్కో నిదుల మంజూరుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, తనవంతుగా కూడా సాయం అందేలా చూస్తానని చెప్పారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, ప్యాబ్రికేషన్ హౌస్‌లను వెంకటాచలం దగ్గర నిర్మిస్తామని, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరులో టాయ్‌లెట్ల నిర్మాణం జరుగుతుందని, దగ‌్గరాజపట్నం పోర్టు మంజూరైన విషయం అందరికీ తెలిసిందేనని వెంకయ్య అన్నారు. చెరువులను అభివృద్ధి చేయడంతోపాటు వాటి సుందరీకరణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు. కేంద్రం ఎన్‌సీఈఆర్‌టీ సెంటర్‌ను మంజూరు చేసేలా తాను చూస్తానని, చింతలరేవు దగ్గర కామధేను బ్రీడింగ్ సెంటర్ నెలకొల్పుతామని ఆయన అన్నారు. ఇంకా ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి తగిన సలహాలు, సూచనలు అందించాల్సిందిగా ఆయన కోరారు.
Advertisement