చర్మ రక్షణకు కొన్ని చిట్కాలు
ముఖం వర్ఛస్సు కోసం, అందమైన చర్మం కోసం అతివలే కాదు మగవారూ అర్రులు చాస్తుంటారు. అయితే మార్కెట్‌లో కనిపించే క్రీములన్నీ కొనుక్కొచ్చి ముఖాలపై ప్రయోగం చేయడం మంచిది కాదు. కొన్ని సహజసిద్ధమైన జాగ్రత్తలూ తీసుకుంటే మన చర్మం కాంతులీనుతుందనడంలో ఎటువంటి సందేహమూలేదు. – సున్నుపిండి, పసుపు, కొద్దిగా రోజ్‌వాటర్, పాలు కలిపిన మిశ్రమాన్ని తయారు చేసుకుని ముఖానికి అప్లయ్ చేయాలి. – బొప్పాయి గుజ్జుకు ఒక స్పూను తేనె కలిపి ముఖానికి అప్లయ్ చేయాలి. పదినిమిషాల తర్వాత […]
Advertisement
ముఖం వర్ఛస్సు కోసం, అందమైన చర్మం కోసం అతివలే కాదు మగవారూ అర్రులు చాస్తుంటారు. అయితే మార్కెట్‌లో కనిపించే క్రీములన్నీ కొనుక్కొచ్చి ముఖాలపై ప్రయోగం చేయడం మంచిది కాదు. కొన్ని సహజసిద్ధమైన జాగ్రత్తలూ తీసుకుంటే మన చర్మం కాంతులీనుతుందనడంలో ఎటువంటి సందేహమూలేదు.
– సున్నుపిండి, పసుపు, కొద్దిగా రోజ్‌వాటర్, పాలు కలిపిన మిశ్రమాన్ని తయారు చేసుకుని ముఖానికి అప్లయ్ చేయాలి.
– బొప్పాయి గుజ్జుకు ఒక స్పూను తేనె కలిపి ముఖానికి అప్లయ్ చేయాలి. పదినిమిషాల తర్వాత కడిగేయాలి.
– వేసవిలో కాఫీ, టీలకు దూరంగా ఉండడం మంచిది. పల్చని మజ్జిగ, లేదా కొబ్బరి నీళ్లు చర్మం పొడిబారకుండా ఉంచుతాయి.
– సమ్మర్‌లో వాటర్ ఎక్కువగా ఉండే మాయిశ్చరైజర్‌లను ఉపయోగించాలి.
Advertisement