పాఠ్యాంశంగా మస్తాన్‌బాబు జీవితగాథ !
ఆదర్శంగా ఉండాలనుకున్న మస్తాన్‌బాబు జీవితం స్ఫూర్తిదాయకమని, ఇలాంటి వ్యక్తులే చరిత్రలో నిలిచిపోతారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మస్తాన్ భౌతికకాయానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మస్తాన్ జీవితగాథ అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మస్తాన్ జీవితగాథను పాఠ్యాంశంగా పెట్టే విషయం పరిశీలిస్తామని అన్నారు. పర్వతారోహణ […]
Advertisement
ఆదర్శంగా ఉండాలనుకున్న మస్తాన్‌బాబు జీవితం స్ఫూర్తిదాయకమని, ఇలాంటి వ్యక్తులే చరిత్రలో నిలిచిపోతారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మస్తాన్ భౌతికకాయానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మస్తాన్ జీవితగాథ అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మస్తాన్ జీవితగాథను పాఠ్యాంశంగా పెట్టే విషయం పరిశీలిస్తామని అన్నారు. పర్వతారోహణ అంటే మస్తాన్‌బాబుకు మక్కువని, అందుకే ఆయన సత్యం సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేస్తున్న ఉద్యోగం సైతం మానుకుని ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే ప్రయత్నం చేశారని మంత్రి చెప్పారు. ఆయన పేరుతో స్మారక భవనం నిర్మిస్తామని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మరో మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. పర్వతారోహణలో అసువులు బాసిన మస్తాన్‌బాబు మృతదేహాన్ని కడసారి చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో గాంధీజనసంగం జన సంద్రమైంది. అశేష ప్రజానీకం అనుసరిస్తుండగా మస్తాన్‌బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది.
Advertisement