ఏపీకి హ్యాండిచ్చిన మోడీ సర్కార్..
అనుకున్నట్లే అయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం హ్యాండిచ్చింది. రాష్ర్టాలను ఇబ్బందులకు గురిచేయడంలో కాంగ్రెస్‌కు తానేమీ తీసిపోనని నిరూపించుకుంది. 2014 ఫిబ్రవరి 20న తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఏపీఇక ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఐదేళ్ళు చాలదని, పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే కనీసం పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని వెంకయ్యనాయుడు ఆనాడు యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒప్పుకోకపోతే, తర్వాతి […]
Advertisement
అనుకున్నట్లే అయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం హ్యాండిచ్చింది. రాష్ర్టాలను ఇబ్బందులకు గురిచేయడంలో కాంగ్రెస్‌కు తానేమీ తీసిపోనని నిరూపించుకుంది. 2014 ఫిబ్రవరి 20న తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఏపీఇక ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఐదేళ్ళు చాలదని, పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే కనీసం పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని వెంకయ్యనాయుడు ఆనాడు యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒప్పుకోకపోతే, తర్వాతి ప్రభుత్వం తమదే గనుక తాము వచ్చిన తర్వాత ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కూడా పార్లమెంట్ సాక్షిగా వెంకయ్య ప్రకటించారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ఏపీకి వచ్చిన నరేంద్రమోడీ కూడా పదే పదే ఈ హామీని ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తుంది. రాష్ర్టాన్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీలో సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించుకోవడానికి గాల్లో విహరిస్తున్నారు. ప్రత్యేక హోదా దక్కదని ఇప్పటికే అనేకసార్లు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు పరోక్షంగా చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. సుజనాచౌదరి వంటి ఏపీ మంత్రులు రాదని కేంద్రం చెప్పలేదు కాబట్టి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నారు. చివరికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచనే లేదని పార్లమెంట్‌లోనే కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియచేసింది.
ఏడాది క్రితం రాజ్యసభలో ప్రకటించిన యూపీఏ నేతలు గాని, మన్‌మోహన్‌సింగ్‌ను డిమాండ్ చేసిన బీజేపీ నేత వెంకయ్యనాయుడు గాని ప్రత్యేక హోదా గురించి మాట్లాడటంలేదు. నాడు అడ్డగోలుగా రాష్ర్టాన్ని విభజించి తగిన మూల్యం చెల్లించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంత జరిగినా ఎన్‌డీఏ సర్కార్ తీరును పట్టించుకోవడంలేదు. కేంద్రం ఆడించినట్లుగా ఆడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా రాదని ముందుగా తెలిసినా సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనిపించడంలేదు. ఏవో రాయితీలు వచ్చాయిగా..ఇంకా వస్తాయిగా అనుకుంటున్నారే గాని, ప్రత్యేక హోదా వస్తే రాష్ర్టానికి లభించే ఊరట గురించి ఆలోచించడంలేదు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదు గనుకే ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని కేంద్రం చెబుతుంటే, ఆ బాధ్యత కేంద్రానిదే అని రాష్ట్రం అంటోంది. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు తమది కాదంటే తమది కాదని తప్పించుకుంటున్నాయి.
Advertisement