కొంపముంచుతున్న 108

హైదరాబాద్‌ : 108.. ఈ పేరు చెప్పగానే వై.ఎస్‌. ప్ర‌భుత్వంలో ప్ర‌వేశ‌పెట్టిన ఆరోగ్య‌శ్రీ అంబులెన్స్‌ కుయ్‌.. కుయ్‌లు గుర్తుకొస్తాయి! కానీ, ఈ పేరు చెప్పగానే కుయ్యో మొర్రో.. అంటున్నారు కొంతమంది పోలీసు అధికారులు. ఇందుకు కారణం 108 వాహనం కాదు.. అపాయింటెడ్‌ డేకు కొద్ది రోజుల ముందు డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్‌ కేడర్‌ ఎస్పీల సీనియారిటీని ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో నెంబరు 108! వందలమంది డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డీఎస్పీలతోపాటు నిరుద్యోగుల జీవితాలను ఈ […]

Advertisement
Update:2015-04-24 20:51 IST
హైదరాబాద్‌ : 108.. ఈ పేరు చెప్పగానే వై.ఎస్‌. ప్ర‌భుత్వంలో ప్ర‌వేశ‌పెట్టిన ఆరోగ్య‌శ్రీ అంబులెన్స్‌ కుయ్‌.. కుయ్‌లు గుర్తుకొస్తాయి! కానీ, ఈ పేరు చెప్పగానే కుయ్యో మొర్రో.. అంటున్నారు కొంతమంది పోలీసు అధికారులు. ఇందుకు కారణం 108 వాహనం కాదు.. అపాయింటెడ్‌ డేకు కొద్ది రోజుల ముందు డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్‌ కేడర్‌ ఎస్పీల సీనియారిటీని ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో నెంబరు 108! వందలమంది డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డీఎస్పీలతోపాటు నిరుద్యోగుల జీవితాలను ఈ జీవో తారుమారు చేస్తోంది. వారిని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. భవిష్యత్తులో పదోన్నతులు.. మంచి పోస్టింగులు.. ఏపీపీఎస్పీ, టీఎస్‌పీఎస్సీల ద్వారా నియామకాలు ఉండకపోవచ్చునన్న తీవ్ర ఆందోళనకర సంకేతాలను ఇస్తోంది. ఈ జీవోలో 2007 బ్యాచ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డీఎస్పీలకు చోటుదక్కింది. అయితే, అందులో పేరుందని సంతోషించేలోగా.. వారి కింద పనిచేసే ఇన్‌స్పెక్టర్లు వారికి ఉన్నతాధికారులు అయిపోయారు. ఇక, 2010, 2012 బ్యాచ్‌కు చెందిన 115 మంది డీఎస్పీలకు సీనియారిటీలో చోటే లేదు. వీరంతా ఇప్పుడు పోలీసు శాఖలో డీఎస్పీలే. ఉద్యోగాల్లో ఉన్నారు కాని వారికి మంజూరైన పోస్టులు లేవు. ఆ పోస్టుల్లో ప్రమోటీ అధికారులను కూర్చోబెట్టారు. ఇదీ 108 క‌థ‌!!!
Tags:    
Advertisement

Similar News