నేపాల్‌కు బీఎస్‌ఎన్‌ఎల్ ‘లోకల్’, ఎయిర్‌టెల్ ఫ్రీ కాల్స్
నేపాల్‌ను చిగురుటాకులా వణికించిన భూకంపంలో చిక్కుకున్న తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచేస్తున్న భారతీయులకు టెలికాం కంపెనీలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. నేపాల్‌లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫరిచ్చింది. శనివారం అర్థరాత్రి నుంచి 48 గంటలపాటు ఇండియాలోని ఏ ఎయిర్‌టెల్ మొబైల్ నుంచైనా.. నేపాల్‌కు ఉచితంగా కాల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. నేపాల్ స్థానిక నెంబర్లతోపాటు హెల్ప్‌లైన్ నెంబర్లన్నింటికీ ఫ్రీకాల్స్ చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ ప్రకటన వచ్చిన రెండు గంటలకే బీఎస్‌ఎన్‌ఎల్ […]
Advertisement
నేపాల్‌ను చిగురుటాకులా వణికించిన భూకంపంలో చిక్కుకున్న తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచేస్తున్న భారతీయులకు టెలికాం కంపెనీలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. నేపాల్‌లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫరిచ్చింది. శనివారం అర్థరాత్రి నుంచి 48 గంటలపాటు ఇండియాలోని ఏ ఎయిర్‌టెల్ మొబైల్ నుంచైనా.. నేపాల్‌కు ఉచితంగా కాల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. నేపాల్ స్థానిక నెంబర్లతోపాటు హెల్ప్‌లైన్ నెంబర్లన్నింటికీ ఫ్రీకాల్స్ చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ ప్రకటన వచ్చిన రెండు గంటలకే బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇలాంటి పథకాన్నే ప్రకటించింది. శనివారం అర్థరాత్రి నుంచి మూడ్రోజులపాటు నేపాల్‌కు చేసే కాల్స్‌కు లోకల్ కాల్ చార్జీలను వర్తిపంచేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా నేపాల్‌కు ఐఎస్‌డీ కాల్ ధర నిమిషానికి 10 రూపాయలు. అటు ఢిల్లీ, ముంబైలలో సేవలందిస్తున్న ఎంటీఎన్‌ఎల్ కూడా మూడ్రోజులపాటు నేపాల్ కాల్స్‌కు లోకల్ చార్జీలు అప్లై అవుతాయని స్పష్టం చేసింది.
Advertisement