ఉద్యోగం కన్నా కుటుంబం ఎంతో ముఖ్యం: ప‌్రధాని మోడీ
జీవితాన్ని రోబోల్లా గడప వద్దని, దీనివల్ల కుటుంబ జీవితానికి దూరమై పోతారని ప్రధానమంత్రి నరేంద్రమోడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హితవు చెప్పారు. లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో ఆయన శిక్షణలో ఉన్న ఐఏఎస్‌ల సమావేశంలో ప్రసంగిస్తూ… కుటుంబాల కోసం మీరంతా తగిన సమయం కేటాయిస్తున్నారా… ఒక్క క్షణం ఆలోచించండి… మీ ఆలోచనల్లో లేదని అనిపిస్తే వెంటనే కుటుంబం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఎవరూ కూడా నిస్సారంగా ఉండకూడదు… కుటుంబాన్ని విస్మరిస్తే ఆ ప్రభావం ఉద్యోగంపైన […]
Advertisement
జీవితాన్ని రోబోల్లా గడప వద్దని, దీనివల్ల కుటుంబ జీవితానికి దూరమై పోతారని ప్రధానమంత్రి నరేంద్రమోడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హితవు చెప్పారు. లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో ఆయన శిక్షణలో ఉన్న ఐఏఎస్‌ల సమావేశంలో ప్రసంగిస్తూ… కుటుంబాల కోసం మీరంతా తగిన సమయం కేటాయిస్తున్నారా… ఒక్క క్షణం ఆలోచించండి… మీ ఆలోచనల్లో లేదని అనిపిస్తే వెంటనే కుటుంబం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఎవరూ కూడా నిస్సారంగా ఉండకూడదు… కుటుంబాన్ని విస్మరిస్తే ఆ ప్రభావం ఉద్యోగంపైన కూడా పడుతుంది… దీనివల్ల మంచి ఫలితాలు వచ్చే పనులు చేయలేరు. ఎప్పుడూ ఆందోళనగా ఉంటే జీవితంలో ఏమీ సాధించలేరని ఆయన చెప్పారు. సమావేశంలో బిగిసుకుపోయినట్టు కూర్చున్న ఉద్యోగుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ భారాన్ని మోస్తున్నట్టు అంత గంభీరంగా ఉండాల్సిన అవసరం లేదని చమత్కరించారు. దీంతో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. శీలం పరమ భూషణం అని ఉద్యోగులకు ఉద్భోదిస్తూ కళాశాలలో పుస్తకాల్లో జీవించేవారే సివిల్స్‌లో నెగ్గుతారని, అలాగని కేంద్ర ప్రభుత్వ దస్త్రాలకు అతుక్కుపోతే దస్త్రాల్లోనే ఉండిపోతారని ఆయన అన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎప్పుడూ దస్త్రాలుంటాయని, అలాగని మీ జీవితాలు కూడా దస్త్రాలుగా మారిపోకూడదని మోడి అన్నారు.
Advertisement