మహిళా సమస్యలు, బెల్ట్ షాపులపై పోరాటం
విశాఖ : మహిళా సమస్యలు, బెల్ట్ షాపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల లాఠీఛార్జ్ ఘటనలో 14 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని రోజా అన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడి కార్యకర్తలపై కక్ష సాధింపుకు పూనుకోవడం దారుణమని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విమర్శలకు దిగడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలను […]
Advertisement
విశాఖ : మహిళా సమస్యలు, బెల్ట్ షాపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల లాఠీఛార్జ్ ఘటనలో 14 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని రోజా అన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడి కార్యకర్తలపై కక్ష సాధింపుకు పూనుకోవడం దారుణమని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విమర్శలకు దిగడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలను రెచ్చగొడుతూ తనపై అనవసరంగా కేసులు పెడుతున్నారని రోజా ఆరోపించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని తెలుగుదేశం నాయకులు మౌనంగా ఉంటే తమ గౌరవం కాపాడుకున్నవారవుతారని ఆమె అన్నారు.
Advertisement