రాజధాని నిర్మాణం కోసం ఓపెన్ టెండర్లు: చంద్రబాబు
రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ పనుల్ని మే 15 లోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాజధాని నిర్మాణానికి ఓపెన్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో నీరు-చెట్టు కార్యక్రమానికి పెద్దపీట వేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఆయన కోరారు. ఆరు జిల్లాల్లో ప్రారంభించే ఈ కార్యక్రమానికి 26 కోట్లు ఖర్చు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వారంలో మూడు, నాలుగు రోజులు […]
Advertisement
రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ పనుల్ని మే 15 లోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాజధాని నిర్మాణానికి ఓపెన్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో నీరు-చెట్టు కార్యక్రమానికి పెద్దపీట వేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఆయన కోరారు. ఆరు జిల్లాల్లో ప్రారంభించే ఈ కార్యక్రమానికి 26 కోట్లు ఖర్చు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వారంలో మూడు, నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని తాను పర్యవేక్షిస్తానని చంద్రబాబు చెప్పారు. ఈ పథకానికి ఎంత ఖర్చయినా వెనకాడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇసుక పాలసీలో పారదర్శకత కోసం అవసరమైన చట్టాలు తీసుకు వస్తామని ఆయన అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత తాను తీసుకుంటానని, అవి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవలసింది మీరే అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఆయన హితబోధ చేశారు. అవసరమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువల వద్ద నిద్రపోయి అయినా సరే అవి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని చంద్రబాబు కోరారు.
Advertisement