సంపూర్ణ ఆనందంతో ఉన్నా...ఖుష్బూ

నటి ఖుష్బుని చూస్తే ఎవరికైనా ఆత్మవిశ్వాసంతో సంతోషంగా జీవించగల వ్యక్తిగా కనబడతారు. తను నమ్మినది ధైర్యంగా ఆచరించగల వ్యక్తిగానూ చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు.. మొత్తానికి పరిస్థితులు ఎలాగున్నా మనుషులు, ముఖ్యంగా మహిళలు తమ ఉనికిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాల నే జీవన సూత్రానికి ఖుష్భుని ప్రతీకగా చూపించవచ్చు. ఇక్కడ కనబడుతున్న విషయాలు, కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాల్లోంచి తీసుకున్నవి. వీటిలో ఖుష్బు వ్యక్తిత్వం మరింత స్పష్టంగా తెలుస్తోంది. -సంతోషమంటే మొహంమీద నవ్వుతో ప్రశాంతంగా బతకటం. -అతి […]

Advertisement
Update:2015-04-22 04:39 IST

నటి ఖుష్బుని చూస్తే ఎవరికైనా ఆత్మవిశ్వాసంతో సంతోషంగా జీవించగల వ్యక్తిగా కనబడతారు. తను నమ్మినది ధైర్యంగా ఆచరించగల వ్యక్తిగానూ చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు.. మొత్తానికి పరిస్థితులు ఎలాగున్నా మనుషులు, ముఖ్యంగా మహిళలు తమ ఉనికిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాల నే జీవన సూత్రానికి ఖుష్భుని ప్రతీకగా చూపించవచ్చు. ఇక్కడ కనబడుతున్న విషయాలు, కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాల్లోంచి తీసుకున్నవి. వీటిలో ఖుష్బు వ్యక్తిత్వం మరింత స్పష్టంగా తెలుస్తోంది.
-సంతోషమంటే మొహంమీద నవ్వుతో ప్రశాంతంగా బతకటం.
-అతి పెద్ద భయం ప్రేమించే వ్యక్తులను పోగొట్టుకుంటానేమోనని.
-కుటుంబంలో ఒక విషయాన్ని మార్చుకునే అవకాశం వస్తే….ఏమీ మార్చుకోను. లోటుపాట్లతో సహా య ధాతథంగా అంగీకరిస్తాను.
-ఎవరి సహాయం లేకుండా నా సమస్యలను నేనే పరిష్కరించుకోవటం నేను సాధించిన విజయం.
-చనిపోయి మరో జన్మ ఎత్తాల్సి వస్తే సరిగ్గా ఇప్పుడెలా ఉన్నానో అలాగే కావాలనుకుంటాను.
-విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం అన్నింటికంటే దయనీయమైనది.
-అత్యంత నచ్చిన వృత్తి నటన, నచ్చిన ప్రదేశం చెన్నై.
-నన్ను ఇతరులకంటే ప్రత్యేకంగా చూపేవి నా నవ్వు, నా యాటిట్యూడ్.
-మగవారిలో బాగా నచ్చేవి నిజాయితీ, ప్రాక్టికాలిటీ .
-నా స్నేహితుల గొప్పతనం గురించి చెప్పాలంటే వారు నన్ను, నన్నుగా ఉంచుతారు. నాపై ఏదైనా విమర్శలు చేయాలన్నా పరుషంగా మాట్లాడరు. నా కష్ట సుఖాల్లో నాతో కలిసి ఉంటారు.
-పిల్లలు పుట్టాక ఎక్కువగా చదవటం కుదరటం లేదు. నాకు మిల్స్ అండ్ బూన్ కథనాలు నచ్చవు. తస్లీమా నస్రీన్ లజ్జ, బెట్టీ మహముదీ రాసిన నాట్ వితవుట్ మై డాటర్ రచనలు నచ్చుతాయి.
-అమితాబ్ బచ్చన్ ని రియల్లైఫ్ హీరోగా అభిమానిస్తాను. ఆయన పోస్టర్లు నా గదినిండా అతికించి ఉంటాయి. జీవితంలో అన్ని కోణాల్లోనూ ఆయన హీరోనే. కింద పడినా అంతే వేగంగా పైకి లేచే లక్షణం ఆయనలో ఉంది.
-రంగనాయకి అనే పేరంటే నాకు చాలా ఇష్టం. మాళవిక అన్నా ఇష్టమే. నా కూతురికి పెట్టుకోవాలనుకున్నా కుదరలేదు. నా పూర్వపేరు నికత్ అన్నా ఇష్టమే. నికత్, ఖుష్బూ ఈ రెండింటి అర్థం పరిమళమే.
-ప్రస్తుత నా మానసిక స్థితి గురించి చెప్పాలంటే సంపూర్ణ ఆనందంతో ఉన్నా.
-మరణం గురించి…ప్రశాంతంగా నిద్రలోనే చనిపోవాలి…అయితే నా పిల్లల పిల్లలను చూశాక. మా అమ్మాయిల జీవితాలకు పూర్తి భద్రత చేకూరాక.
-మనకు తెలియనివారి గురించి మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదనేది నాకు నచ్చిన జీవన సూత్రం.

Tags:    
Advertisement

Similar News