రాజధానికి మరో ఐదువేల ఎకరాలు సేకరించండి: చంద్రబాబు
రాజధానికి సంబంధించి కోర్ కేపిటల్‌ను 350 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాజధాని నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనురించే అంశంపై కూడా చర్చ జరిపింది. రాజధాని కోసం నందిగామ——-, కంచికచర్ల మధ్యలో మరో ఐదు వేల ఎకరాల భూమి సేకరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ బాధ్యత ఉత్తరకోస్తా మంత్రులకే అప్పగించాలని నిర్ణయించారు. సత్వరం నీటి సంఘాల ఎన్నికలు […]
Advertisement
రాజధానికి సంబంధించి కోర్ కేపిటల్‌ను 350 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాజధాని నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనురించే అంశంపై కూడా చర్చ జరిపింది. రాజధాని కోసం నందిగామ——-, కంచికచర్ల మధ్యలో మరో ఐదు వేల ఎకరాల భూమి సేకరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ బాధ్యత ఉత్తరకోస్తా మంత్రులకే అప్పగించాలని నిర్ణయించారు. సత్వరం నీటి సంఘాల ఎన్నికలు జరపాలని, ఉపాధి హామీ నిధులు నీరు-చెట్టు పథకానికి ఉపయోగించాలని కేబినెట్ నిర్ణయించింది. 37 వేల చెక్ డ్యాములకు రిపేర్లు చేయాలని అధికారులు తెలపగా అందుకు అవసరమైన అనుమతులు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. 380 ఇసుక రీచులలో తవ్వకాలు జరుపుతున్నట్టు అధికారులు తెలపగా అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణలో ఈ తవ్వకాలు ఉండాలని ఆదేశించారు. కేంద్ర ఉద్యోగుల కంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా ఇచ్చామని, అవినీతికి పాల్పడితే సహించేది లేదని, అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. ఉద్యోగులతో పని చేయించుకోవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చంద్రబాబు సహచర మంత్రులకు సూచించారు.
Advertisement