రూ. 280 కోట్ల కొకైన్ స్వాధీనం
గుజరాత్‌లోని పోర్‌బందర్ తీర ప్రాంతం నుంచి ఎనిమిది మంది పాకిస్థానీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వచ్చిన ఇంటిలిజెన్స్ నివేదికలను ఆధారం చేసుకుని సముద్ర తీరంలోను, రాష్ట్రంలోను నిఘాను పటిష్టం చేశారు. ఈ నిఘా బృందాలకు సముద్రం నుంచి వస్తున్న రెండు పడవలు కనిపించాయి. అప్రమత్తమై వీటి గురించి ఆరా తీస్తే వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఎనిమిది మంది పాక్ జాతీయులు అరేబియా సముద్రం […]
Advertisement
గుజరాత్‌లోని పోర్‌బందర్ తీర ప్రాంతం నుంచి ఎనిమిది మంది పాకిస్థానీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వచ్చిన ఇంటిలిజెన్స్ నివేదికలను ఆధారం చేసుకుని సముద్ర తీరంలోను, రాష్ట్రంలోను నిఘాను పటిష్టం చేశారు. ఈ నిఘా బృందాలకు సముద్రం నుంచి వస్తున్న రెండు పడవలు కనిపించాయి. అప్రమత్తమై వీటి గురించి ఆరా తీస్తే వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఎనిమిది మంది పాక్ జాతీయులు అరేబియా సముద్రం మీదుగా భారత్‌లోకి వచ్చి మాదక ద్రవ్యాలను అక్రమంగా డంప్ చేయాలనుకున్నారు. దీన్ని కోస్ట్ గార్డులు సకాలంలో గుర్తించి పట్టుకున్నారు. వీరి దాడిలో రూ. 280 కోట్ల విలువ జేసే కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. వీరు ప్రయాణించిన రెండు పడవలు, శాటిలైట్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement