ఆప్‌నుంచి రెబల్స్ బహిష్కరణ
అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన సామాజిక ఉద్యమంలోంచి ఆప్ పార్టీ ఆవిర్భవించింది. ఢిల్లీ అసెంబ్లీ అప్పగిస్తే ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి అన్ని పార్టీలనూ ఊడ్చేసి మరీ ఆప్‌కు పట్టం కట్టారు దేశ రాజధాని ప్రజలు. అన్ని పార్టీల్లో మాదిరిగానే ఆప్‌లో ముసలం పుట్టింది. ఆధిపత్యం కోసం కొట్లాటలు మొదలయ్యాయి. కొందరు నేతలు అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా ప్రశాంతి భూషణ్, ఆయన తండ్రి శాంతి భూషణ్ కేజ్రివాల్ కి వ్యతిరేకంగా చేయ్యాల్సిందంతా చేశారు. శాంతి […]
అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన సామాజిక ఉద్యమంలోంచి ఆప్ పార్టీ ఆవిర్భవించింది. ఢిల్లీ అసెంబ్లీ అప్పగిస్తే ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి అన్ని పార్టీలనూ ఊడ్చేసి మరీ ఆప్‌కు పట్టం కట్టారు దేశ రాజధాని ప్రజలు. అన్ని పార్టీల్లో మాదిరిగానే ఆప్‌లో ముసలం పుట్టింది. ఆధిపత్యం కోసం కొట్లాటలు మొదలయ్యాయి. కొందరు నేతలు అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా ప్రశాంతి భూషణ్, ఆయన తండ్రి శాంతి భూషణ్ కేజ్రివాల్ కి వ్యతిరేకంగా చేయ్యాల్సిందంతా చేశారు. శాంతి భూషణ్ అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కేజ్రివాల్ కి ఓటు వేయ్యవద్దు కిరణ్ బేడికి ఓటు వేయమని ఢిల్లీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు, కేజ్రివాల్ మీద చల్లవలసినంత బురద చల్లారు. ప్రశాంతి భాషణ్ కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. పార్టీ విజయానికి కృషి చేయకపోగా ఒక దశలో ప్రెస్ మీట్ పెట్టి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మాట్లాడాలని అనుకున్నాడు. కాని కార్యకర్తల ఒత్తిడి వలన ఆప్రయత్నం విరమించుకున్నాడు. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. పార్టి ముఖ్య నాయకులు ప్రశాంతి భూషణ్ మీద చర్యతీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ లోగా ప్రశాంతి భూషణ్ యోగేంద్ర యాదవ్ ను తనవైపునకు తిప్పుకున్నాడు.. యోగేంద్ర యాదవ్ మేధావి. పార్టి నిర్మాణానికి విజయానికి తీవ్రంగా కృషి చేశాడు. యోగేంద్ర యాదవ్ ప్రశాంతి భూషణ్ మాయలో పడటం దురదృష్టకరం. చివరికి ప్రశాంత్‌భూషణ్, యోగేంద్రయాదవ్ వంటి వ్యవస్థాపక సభ్యుల్ని ఆప్ నుంచి బహిష్కరించారు. ఆప్‌ను వ్యతిరేకించే మరో పార్టీకి బీజం పడుతోంది.