తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు?
హైదరాబాద్: మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పి చర్చకు తెరతీశారు. సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు ప‌్రకటించడం ద్వారా ఎమ్మెల్యేల్లో ఆశలకు ప్రాణం పోశారు. రాష్ట్రంలో శాసన సభ్యుల సంఖ్య 119 కావడంతో మంత్రుల సంఖ్య 18 వరకు ఉండాలి. ప్రస్తుతం మంత్రివర్గంలో పద్ధెనిమిది మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 నెలలు పూర్తయ్యింది. ఈనెల 24న జరిగే పార్టీ ప్లీనరీలో తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై సమీక్ష జరుపుతారు. ప్లీనరీ […]
Advertisement
హైదరాబాద్: మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పి చర్చకు తెరతీశారు. సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు ప‌్రకటించడం ద్వారా ఎమ్మెల్యేల్లో ఆశలకు ప్రాణం పోశారు. రాష్ట్రంలో శాసన సభ్యుల సంఖ్య 119 కావడంతో మంత్రుల సంఖ్య 18 వరకు ఉండాలి. ప్రస్తుతం మంత్రివర్గంలో పద్ధెనిమిది మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 నెలలు పూర్తయ్యింది. ఈనెల 24న జరిగే పార్టీ ప్లీనరీలో తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై సమీక్ష జరుపుతారు. ప్లీనరీ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ముఖ్యమంత్రి దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక్క మహిళ కూడా లేరు. ఈలోటును కూడా కేసీఆర్ భర్తీ చేస్తారని అంటున్నారు. అయితే కొంతమందిని సాగనంపితే కాని కొత్తవారిని తీసుకోవడం ప్రశ్నార్థకమే!
Advertisement