అవి బూటకపు ఎన్‌కౌంటర్లు: మావో నేత‌ జగన్

హైదరాబాద్: తెలంగాణలోని ఆలేరు.. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం వద్ద ఇటీవల జరిగిన రెండు ఎన్‌కౌంటర్లు.. బూటకమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అమాయకులైన కూలీలు, మైనార్టీలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు హత్య చేసి వాటికి ఎన్‌కౌంట‌ర్ ముసుగు వేశాయ‌ని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు చనిపోవడంతో.. దానికి ప్రతీకారంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆ రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం.. వికారుద్దీన్‌తోపాటు మరో […]

Advertisement
Update:2015-04-20 00:46 IST
హైదరాబాద్: తెలంగాణలోని ఆలేరు.. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం వద్ద ఇటీవల జరిగిన రెండు ఎన్‌కౌంటర్లు.. బూటకమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అమాయకులైన కూలీలు, మైనార్టీలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు హత్య చేసి వాటికి ఎన్‌కౌంట‌ర్ ముసుగు వేశాయ‌ని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు చనిపోవడంతో.. దానికి ప్రతీకారంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆ రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం.. వికారుద్దీన్‌తోపాటు మరో నలుగురిని పథకం ప్రకారం బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని ఆరోపించారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వం.. శేషాచలం అడవుల్లో కూలీలను ముందుగానే పట్టుకొచ్చి కాల్చిచంపి.. తర్వాత ఎన్‌కౌంటర్‌ కథ అల్లిందని ఈ ప్రకటనలో ఆరోపించారు.
Tags:    
Advertisement

Similar News