రైలు ప్రయాణంలో లగేజీకి బీమా!
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకునే వారికి బ్యాగేజీ బీమా కల్పించాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. ల్యాప్‌టాప్, మొబైల్‌ఫోన్ వంటి విలువైన వస్తువులు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. టికెట్ బుకింగ్‌తోపాటు ప్రయాణ తరగతి, దూరాన్నిబట్టి బీమా ఏర్పాట్లు చేస్తామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీంతోపాటు ఆస్పత్రి సేవలు అవసరమయ్యే సందర్భంలోనూ బీమా కల్పించే యోచన ఉందన్నారు. ఈ మేరకు దేశంలోని ప్రముఖ బీమా సంస్థలలో ఒకటైన ‘న్యూ ఇండియా […]
Advertisement
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకునే వారికి బ్యాగేజీ బీమా కల్పించాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. ల్యాప్‌టాప్, మొబైల్‌ఫోన్ వంటి విలువైన వస్తువులు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. టికెట్ బుకింగ్‌తోపాటు ప్రయాణ తరగతి, దూరాన్నిబట్టి బీమా ఏర్పాట్లు చేస్తామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీంతోపాటు ఆస్పత్రి సేవలు అవసరమయ్యే సందర్భంలోనూ బీమా కల్పించే యోచన ఉందన్నారు. ఈ మేరకు దేశంలోని ప్రముఖ బీమా సంస్థలలో ఒకటైన ‘న్యూ ఇండియా అస్యూరెన్స్’తో సంయుక్తంగా ఈ సేవలు అందించేందుకు చర్చలు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
Advertisement