గిఫ్ట్ పెద్దమొత్తమయితే ఐఎఎస్‌ల ఉద్యోగం ఫట్
న్యూఢిల్లీ: బహుమతుల స్వీకరణపై ఐఎఎస్ అధికారులకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా ఐదు వేల రూపాయలకు మించిన బహుమతులు పొందకూడదు. పెళ్లి, వార్షికోత్సవం, అంత్యక్రియలు వంటి కార్యక్రమాల్లో మాత్రం సమీప బంధుమిత్రుల నుంచి రూ.25 వేలకు మించని బహుమతులు స్వీకరించ వచ్చని, అయితే వారితో ఎలాంటి అధికారిక వ్యవహారాలూ నడపరాదని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లోని బహుమతుల గురించి ప్రభుత్వానికి తెలియ చేయాలని కొత్త నిబంధనల్లో ఆదేశించింది.
Advertisement