మిషన్ కాకతీయ వేగవంతం చేయండి:హరీష్
మిషన్ కాకతీయను వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపు ఇచ్చారు. ఇప్పటికి ఏడు వేల చెరువులకు పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చామని, శిఖం భూములకు 1982 రికార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మిషన్‌లో పనిచేసే ఇంజినీర్లకు వాహనాలు సమకూరుస్తామని, చెరువులను పరిరక్షించడానికి, పర్యవేక్షించడానికి జిల్లాల్లో కమిటీలు వేయాలని ఆయన ఆదేశించారు. వర్షాలు పడేసరికి మిషన్ కాకతీయ పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రతి చెరువుకు ఒక విశిష్ట నెంబర్ ఇస్తామని, వాటి నిర్వహణకు […]
Advertisement
మిషన్ కాకతీయను వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపు ఇచ్చారు. ఇప్పటికి ఏడు వేల చెరువులకు పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చామని, శిఖం భూములకు 1982 రికార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మిషన్‌లో పనిచేసే ఇంజినీర్లకు వాహనాలు సమకూరుస్తామని, చెరువులను పరిరక్షించడానికి, పర్యవేక్షించడానికి జిల్లాల్లో కమిటీలు వేయాలని ఆయన ఆదేశించారు. వర్షాలు పడేసరికి మిషన్ కాకతీయ పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రతి చెరువుకు ఒక విశిష్ట నెంబర్ ఇస్తామని, వాటి నిర్వహణకు అదెంతో ఉపయోగపడుతుందని హరీష్‌రావు అన్నారు. వచ్చే యేడాది పాకాల, రామప్ప, లక్కవరం చెరువుల పూడికతీతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
Advertisement