గాడ్సే పేరుకు అనుమతి వచ్చింది!
ఇప్పటివరకు లోక్‌సభ, రాజ్యసభల్లో నిషేధిత పదం గాడ్సే. జాతిపితను 1948 జనవరి 30న కాల్చి చంపిన నాథూరాం గాడ్సే పేరులో చివర గాడ్సే ఉండడంతో దీని ఉచ్చారణను లోక్‌సభ, రాజ్యసభలో నిషేధించారు. ఇది 1956లో జరిగింది. కాని అప్పటి నుంచి ఈ పేరు వినిపించకుండా చర్యలు తీసుకున్నారు. కాని ఇపుడు ఇదే సమస్య అయ్యి కూర్చుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నాశిక్ హేమంత్ తుకారాం గాడ్సే అనే వ్యక్తి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్‌లో అడుగుపెట్టాడు. ఇతను శివసేన […]
Advertisement
ఇప్పటివరకు లోక్‌సభ, రాజ్యసభల్లో నిషేధిత పదం గాడ్సే. జాతిపితను 1948 జనవరి 30న కాల్చి చంపిన నాథూరాం గాడ్సే పేరులో చివర గాడ్సే ఉండడంతో దీని ఉచ్చారణను లోక్‌సభ, రాజ్యసభలో నిషేధించారు. ఇది 1956లో జరిగింది. కాని అప్పటి నుంచి ఈ పేరు వినిపించకుండా చర్యలు తీసుకున్నారు. కాని ఇపుడు ఇదే సమస్య అయ్యి కూర్చుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నాశిక్ హేమంత్ తుకారాం గాడ్సే అనే వ్యక్తి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్‌లో అడుగుపెట్టాడు. ఇతను శివసేన పార్టీకి చెందిన ఎంపీ. ఇటీవల హేమంత్‌ను ఓ ఎంపీ గాడ్సే అని సంబోధిస్తుండగా గమనించిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కలుగజేసుకుని ఆ పదం నిషేధమంటూ అడ్డు చెప్పారు. దీంతో వేదనకు గురైన ఈ ఎంపీ ఇంటి పేరు గాడ్సే ఉన్నంత మాత్రాన దాని మీద నిషేధం ఎంతవరకు సమంజసం? అంటూ లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖలు రాశాడు. తన తాత ముత్తాతల నుంచి వస్తున్న పేరు తనకు ఉండడం తప్పు కాదని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో విషయాన్ని అర్ధం చేసుకున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గాడ్సే పదం మీద ఉన్న నిషేధాన్ని ఎత్తి వేశారు. మన ఎంపీ గాడ్సే గారు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement