సీపీఎం జాతీయ కార్యదర్శిగా సీతారాం ఏచూరి?
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ కార్యదర్శి ఎంపికపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ పదవికి ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు గట్టిగా పోటీ పడుతున్నారు. ప్రస్తుత కార్యదర్శి ప్రకాశ్ కారత్ పదవీ కాలం ఈనెల 19న ముగుస్తుంది. ఈ పదవికి ఇపుడు పోలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న సీతారాం ఏచూరి, కేరళకు చెందిన పిళ్ళైలు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఎవరిని దీనికి ఎంపిక చేయాలన్న దానిపై సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొత్త కార్యవర్గంపై […]
Advertisement
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ కార్యదర్శి ఎంపికపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ పదవికి ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు గట్టిగా పోటీ పడుతున్నారు. ప్రస్తుత కార్యదర్శి ప్రకాశ్ కారత్ పదవీ కాలం ఈనెల 19న ముగుస్తుంది. ఈ పదవికి ఇపుడు పోలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న సీతారాం ఏచూరి, కేరళకు చెందిన పిళ్ళైలు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఎవరిని దీనికి ఎంపిక చేయాలన్న దానిపై సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొత్త కార్యవర్గంపై నాలుగు రోజులుగా కసరత్తు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. విశాఖ వేదికగా 19వ తేదీన కొత్త జాతీయ కార్యదర్శిని ఎంచుకోవడానికి జాతీయ కార్యవర్గం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీతారాం ఏచూరికే ఈ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
Advertisement