ముచ్చటగా మూడోసారి మహేష్ తో...
టాలీవుడ్ హాట్ సెన్సేషన్ సమంత హ్యాట్రిక్ కు దగ్గరగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తుంది చుల్ బులీ. ఇప్పటికే ప్రిన్స్ తో కలిసి దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలు చేసింది సమంత. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి మహేష్ సరసన నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్, కొరటాల […]
Advertisement
టాలీవుడ్ హాట్ సెన్సేషన్ సమంత హ్యాట్రిక్ కు దగ్గరగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తుంది చుల్ బులీ. ఇప్పటికే ప్రిన్స్ తో కలిసి దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలు చేసింది సమంత. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి మహేష్ సరసన నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే శ్రీకాంత్ అడ్డాల సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఈ సినిమాలోనే మరోసారి సమంతతో కలిసి మహేష్ నటించే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్టోరీకి సమంత ఓకే చెప్పేసింది. మహేష్ కనుక ఒక్కసారి ఓకే అంటే కాంబినేషన్ సెట్ అయిపోయినట్టే. కాకపోతే ఈమధ్య ఈ హీరోహీరోయిన్ల మధ్య ఇంటర్నెట్ యుద్ధం జరిగింది. వన్-నేనొక్కడినే సినిమా విషయంలో సమంత-మహేష్ ఫ్యాన్స్ మధ్య చాలా హంగామా నడిచింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహేష్, సమంతకు మరోసారి అవకాశమిస్తాడా ఇవ్వడా అనేది సస్పెన్స్ గా మారింది.