రాహుల్ గాంధీ అజ్ఞాతవాసానికి అసలు కారణాలు...
అసలు రాహుల్ అజ్ఞాతంలోకి ఎందుకెళ్ళాడు? అన్న దానిపై అనేక జవాబులు దొరుకుతాయి. ఆయన పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించి పార్టీ పదవులు కట్టబెట్టాలని, ముఖ్యమంత్రుల ఎన్నిక ఎమ్మెల్యేల ఇష్టానుసారమే జరగాలని, సీల్డ్ కవర్‌లతో నాయకులను దింపే సంస్కృతికి ఇకనైనా మంగళం పాడాలని ఆయన కోరుతున్నారు. పార్టీ కింద నుంచి వచ్చే సూచనల మేరకు పని చేయాలి తప్పితే ఢిల్లీ నుంచి ఆదేశాలకు అనుగుణంగా పార్టీని నడపడం తగదన్నది ఆయన మనోగతం. దీనివల్ల పార్టీపై పట్టున్నవారు […]
Advertisement
అసలు రాహుల్ అజ్ఞాతంలోకి ఎందుకెళ్ళాడు? అన్న దానిపై అనేక జవాబులు దొరుకుతాయి. ఆయన పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించి పార్టీ పదవులు కట్టబెట్టాలని, ముఖ్యమంత్రుల ఎన్నిక ఎమ్మెల్యేల ఇష్టానుసారమే జరగాలని, సీల్డ్ కవర్‌లతో నాయకులను దింపే సంస్కృతికి ఇకనైనా మంగళం పాడాలని ఆయన కోరుతున్నారు. పార్టీ కింద నుంచి వచ్చే సూచనల మేరకు పని చేయాలి తప్పితే ఢిల్లీ నుంచి ఆదేశాలకు అనుగుణంగా పార్టీని నడపడం తగదన్నది ఆయన మనోగతం. దీనివల్ల పార్టీపై పట్టున్నవారు నాయకులవుతారని, ప్రజలకు దీనివల్ల మేలు జరుగుతుందని రాహుల్ అభిప్రాయపడుతున్నారు. అయితే దానికి కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు ససేమిరా అంటున్నారు.
తాను పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ తనదైన ముద్రతో అనుకూల ఫలితాలు సాధించలేదు. పాపం ఆయన అలుపెరగకుండా ఎన్నికల ప్రచార సభలకు వెళుతూనే ఉన్నారు. కాని ఆశించిన ఫలితాలు ఏనాడూ రాలేదు. పైగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి కంచుకోటలు కూడా బీటలు వారాయి. ఇదంతా కేవలం సీనియర్ల వ్యూహాత్మక తప్పిదాల వల్లేనన్నది రాహుల్ మనోగతం. ఈ నేపథ్యంలో పార్టీని తనదైన శైలిలో పునర్ వ్యవస్థీకరించాలన్నది ఆయన ఆలోచన. కాని దీనికి సీనియర్లు అంగీకరించకపోవడం… ఇదే విషయంలో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న తల్లిని కూడా ఒప్పించలేక పోవడంతో ఆయన అలిగారు. పార్టీకి దూరంగా ఉండాలని అనుకున్నారు… అదే పని చేశారు. దీని పరిణామమే రాహుల్ అజ్ఞాత వాసం.
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కీలక తరుణంలో బాధ్యతాయుత పదవిలో ఉన్న రాహుల్‌గాంధీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కనిపించడం లేదంటూ ఆయన సొంత నియోజకవర్గం అమేధీలో కూడా పోస్టర్లు వెలిశాయి. జెడ్ కేటగిరిలో ఉన్న ఆయన సెక్యూరిటీ సిబ్బందికి కూడా తెలియనంతగా తప్పించుకు తిరిగారంటే… ఈ 57 రోజులు ఎక్కడున్నారు? ఏం చేశారు? అన్న ప్రశ్నలు ఇపుడు అప్రస్తుతం… కాని ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు త్వరలో తీసుకోవడం ఖాయం. సోనియాగాంధీని గౌరవాధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం కూడా అంతే ఖాయం. అప్పుడు తన కలలు సాకారం కావడానికి ఆయన ప్రయత్నిస్తారన్నది కూడా నూటికి నూరు శాతం ఖాయం. మరి అప్పుడు ఈ సీనియర్ నేతల పరిస్థితి ఏమిటి? పడి ఉంటారా? లఏక లేక మరోసారి కాంగ్రెస్‌ని కుదుపుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!-పీఆర్
Advertisement