జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై మరోసారి హైకోర్టు సీరియస్
హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) ఎన్నికలపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎన్నికల నిర్వహణకు మరో ఆరు నెలల గడువు కావాలంటూ అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తులు స్పందిస్తూ ఎన్నికలను మీరు నిర్వహిస్తారా లేక మమ్మల్ని నిర్వహించమంటారా అని ప్రశ్నించారు. దీంతో న్యాయమూర్తులు ఎన్నిసార్లు గడువు కోరతారని ప్రశ్నించారు. ప్రతిసారీ గడువు కోరడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల […]
Advertisement
హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) ఎన్నికలపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎన్నికల నిర్వహణకు మరో ఆరు నెలల గడువు కావాలంటూ అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తులు స్పందిస్తూ ఎన్నికలను మీరు నిర్వహిస్తారా లేక మమ్మల్ని నిర్వహించమంటారా అని ప్రశ్నించారు. దీంతో న్యాయమూర్తులు ఎన్నిసార్లు గడువు కోరతారని ప్రశ్నించారు. ప్రతిసారీ గడువు కోరడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని, వీటి నిర్వహణకు మరికొంత గడువు అవసరమవుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘంతో నిర్వహిస్తామని అన్నారు. అసలు ఈ ఎన్నికల నిర్వహణకు ఇంత గడువు అవసరమా లేదా అన్నది తాము సోమవారం నిర్ణయిస్తామని చెబుతూ అదే రోజు తుది తీర్పు వెల్లడిస్తామని చెబుతూ కోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది.-పీఆర్
Advertisement