పోలవరం సందర్శించిన జగన్
తన మూడు రోజుల బస్ యాత్రలో భాగంగా ప్రాజెక్టుల బాట పట్టిన వై.ఎస్.ఆర్.సి.అధినేత జగన్ బుధవారం ధవళేశ్వరంలోని సర్ అర్ధర్ కాటన్ బ్యారేజీ సందర్శించిన తర్వాత బస్‌లో పోలవరం చేరారు. అక్కడ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ ఇంజినీర్లతో మాట్లాడి పనులు కొనసాగుతున్న విధాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు […]
Advertisement
తన మూడు రోజుల బస్ యాత్రలో భాగంగా ప్రాజెక్టుల బాట పట్టిన వై.ఎస్.ఆర్.సి.అధినేత జగన్ బుధవారం ధవళేశ్వరంలోని సర్ అర్ధర్ కాటన్ బ్యారేజీ సందర్శించిన తర్వాత బస్‌లో పోలవరం చేరారు. అక్కడ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ ఇంజినీర్లతో మాట్లాడి పనులు కొనసాగుతున్న విధాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన అన్నారు. మూడేళ్ళలోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో తెలిపిందని… ఈవిషయాన్ని ఆ పార్టీ ఎందుకు మరిచిపోయిందని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ నిర్వాసితులపై చూపుతున్న ప్రేమను పోలవరం విషయంలో ఎందుకు చూపడం లేదని జగన్ ప్రశ్నించారు.-పీఆర్
Advertisement