వయసులో చిన్నది...గిటారిస్టుగా చాలా సాధించింది!
రెహమాన్ బృందంలో రాగాలు మీటుతున్న పద్దెనిమిదేళ్ల మోహిని ఎవరికైనా స్నేహితులు తమ వయసు వారే అయి ఉంటారు. కానీ ఇక్కడ ఫొటోలో కనబడుతున్న అమ్మాయికి మాత్రం స్నేహితులంతా తన తండ్రి వయసు వారే. శివమణి అంకుల్, రంజిత్ అంకుల్, శంకర్ మహదేవన్ అంకుల్, లూయిస్ అంకుల్… వీరంతా తన స్నేహితులే అంటుందీ అమ్మాయి. ఎక్కడో బాగా విన్నట్టుగా ఉన్నాయి కదూ ఈ పేర్లన్నీ. అవును…వీరంతా ప్రసిద్ధ సంగీతకళాకారులు. పద్దెనిమిదేళ్ల ఈ యువతి మోహినీ దేవ్ సైతం వారితో […]
రెహమాన్ బృందంలో రాగాలు మీటుతున్న పద్దెనిమిదేళ్ల మోహిని ఎవరికైనా స్నేహితులు తమ వయసు వారే అయి ఉంటారు. కానీ ఇక్కడ ఫొటోలో కనబడుతున్న అమ్మాయికి మాత్రం స్నేహితులంతా తన తండ్రి వయసు వారే. శివమణి అంకుల్, రంజిత్ అంకుల్, శంకర్ మహదేవన్ అంకుల్, లూయిస్ అంకుల్… వీరంతా తన స్నేహితులే అంటుందీ అమ్మాయి. ఎక్కడో బాగా విన్నట్టుగా ఉన్నాయి కదూ ఈ పేర్లన్నీ. అవును…వీరంతా ప్రసిద్ధ సంగీతకళాకారులు. పద్దెనిమిదేళ్ల ఈ యువతి మోహినీ దేవ్ సైతం వారితో సమానంగా తన సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తోంది. గిటారిస్టుగా తన స్థానాన్నిఇప్పటికే పదిలం చేసుకుంది…అదీ ఎఆర్ రెహమాన్ బృందంలో. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక విరాళ సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొంది.. ఈ ప్రదర్శన, పేరు సంపాదించుకునేందుకు ఇచ్చింది కాదని, తన గిటార్ రాగాల ద్వారా మనుషుల భావోద్వేగాలను కదిలించేందుకే ఇచ్చానని ఆమె ఎంతో అనుభవం సాధించిన కళాకారిణిలా చెబుతోంది. మూడేళ్ల వయసునుండే మోహినికి గిటార్ తో పరిచయం ఉంది. ఆమె తండ్రి సుజయ్‌దేవ్ సైతం గిటారిస్టే కావటంతో ఆ అవకాశం కలిగింది. తనకు మ్యూజికల్ నోట్సే జోలపాటలు, నర్సరీ రైమ్స్ అంటుంది మోహిని. కానీ తాను ఇదే రంగంలో కొనసాగుతాననే అవగాహన చిన్నతనంలోనే రావటంతో సాధన మాత్రం
సీరియస్‌గానే చేశానంటుంది. మోహినిలోని కళని మొదటిసారిగా గుర్తించింది ఆమె తండ్రి స్పేహితుడు డ్రమ్ వాయిద్యనిపుణుడు రంజిత్ బారోత్. దేశవ్యా ప్తంగా పేరున్న ఈ కళాకారుడి బృందంతో కలిసి ఆమె ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టింది. వారి బృందంలో మోహినియే అత్యంత పిన్న వయస్కురాలు. ప్రముఖ జాజ్ కళాకారుడు, కంపోజర్ లూయిస్ బ్యాంక్స్ మోహినికి మార్గదర్శకుడిగా వ్యవహరించారు. సోలో ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రోత్సహించారు. ఆ తరువాత…ఇంకేముంది…ఎఆర్ రెహమాన్‌నుండి కోక్ స్టూడియోలో ట్రాక్‌లకు పనిచేయాల్సిందిగా ఆహ్వానం అందింది. అక్కడ సంగీతంలో శిఖరాలు చూశానంటుంది మోహిని. రెహమాన్ గౌరవ డాక్టరేట్ అందుకున్న బార్కెలీ మ్యూజిక్ కాలేజిలోనూ తన ప్రదర్శన ఇచ్చింది.ఇండియన్ టాలెంట్‌ని అంతర్జాతీయంగా ప్రోత్సహించే క్యాపెల్లా బ్యాండ్‌లో స్థానం సంపాదించింది. తరువాత క్యాపెల్లా బృందంలో రెగ్యులర్ కళాకారిణిగా మారింది. అలా ఆమె కొచ్చాడయ్యాన్‌కు సైతం పనిచేసింది. ముంబయిలో జాకిర్‌హుస్సేన్‌తో కలిసి ప్రదర్శన ఇవ్వటం మోహిని సాధించిన మరో విజయం. .ప్రస్తుతం ఆమె తన సొంత ఆల్బమ్‌ని రూపొందించే పనిలో ఉంది. వచ్చే నెలలో రెహమాన్‌తో కలిసి ఉత్తర అమెరికా వ్యాప్తంగా 17 ప్రదర్శనల్లో పాల్గొనబోతోంది. సంగీతాన్ని చదువుని సమన్వయం చేయటం కష్టంగా అనిపించడంతో చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఊహలు, సృజనాత్మకతలతో పనిచేసే రంగంలో ఉండి లెక్కల సూత్రాలను బట్టి కొట్టలేమని నవ్వేస్తుంది మోహిని.