రామోజీలో ఎంత మార్పు!
“నేను కమ్యూనిస్టుని… ఈ దేవుళ్ళు గీవుళ్ళు జాంతానయ్.. పది మందికి ఉపయోగపడేదేమైనా ఉంటే చెప్పండి. చేద్దాం”… ఇవి ఒకప్పటి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మాటలు. కాని కాలంతోపాటే ఆయనా మారారు. అయన శైలీ మారింది. వ్యవహార దృక్పథమూ మారింది. ఒకప్పుడు ఈనాడులో జాతకాలకు సంబంధించి, రాశి ఫలాలు ఇద్దామంటే “అదంతా ట్రాష్. అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు” అనేవారు. ఇపుడు ఈనాడు దినపత్రికలో రెగ్యులర్‌గా తిథి, వార, నక్షత్రాలతో కూడిన పంచాంగం, ఈనాడు ఆదివారం […]
Advertisement
“నేను కమ్యూనిస్టుని… ఈ దేవుళ్ళు గీవుళ్ళు జాంతానయ్.. పది మందికి ఉపయోగపడేదేమైనా ఉంటే చెప్పండి. చేద్దాం”… ఇవి ఒకప్పటి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మాటలు. కాని కాలంతోపాటే ఆయనా మారారు. అయన శైలీ మారింది. వ్యవహార దృక్పథమూ మారింది. ఒకప్పుడు ఈనాడులో జాతకాలకు సంబంధించి, రాశి ఫలాలు ఇద్దామంటే “అదంతా ట్రాష్. అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు” అనేవారు. ఇపుడు ఈనాడు దినపత్రికలో రెగ్యులర్‌గా తిథి, వార, నక్షత్రాలతో కూడిన పంచాంగం, ఈనాడు ఆదివారం పత్రికలో రాశి ఫలాలు… ఈటీవీ… రెండు తెలుగు ఛానళ్ళలో రాశి ఫలాల ప్రసారం… కొనసాగిస్తున్నారు. కాలంతోపాటు మనుషులూ మారతారంటారు. మనుషులతోపాటు మనసులూ మారతాయంటారు… దీనికి రామోజీరావు కన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఎవరుంటారు? ఇపుడు కొత్తగా ఆయన దైవభక్తి బాట పట్టినట్టున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి బాటలు వేస్తున్నారు. ఇందులో 108 నమూనా ఆలయాలతో ఓం ఆథ్యాత్మిక నగరం నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. దేవాలయాలతోపాటు భక్తి సమావేశ మందిరాలు, భక్తి సినిమా ధియేటర్లు, హోమ నిర్వహణ ప్రదేశాలు, పుణ్య స్నానాలు చేసేందుకు పుష్కరిణి, భక్తి వేదికలు నిర్మిస్తారట! ఒకప్పుడు దేవుడంటేనే కయ్యమనే రామోజీరావు ఇపుడు ఆ పేరుతో రయ్‌మని ముందుకు వెళుతున్నారంటే…. ఎంత మార్పు!-పీఆర్
Advertisement