అకాల వర్షం బాధితులకు పరిహారం
అకాల వర్షాల కారణంగా తెలంగాణలో మృత్యువాత పడ్డ బాధితులకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఈ పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. జిల్లాల వారీగా పంట, ఆస్తి నష్టం వివరాలను వెంటనే సేకరించి తెలియజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా ఎపీలో అకాల వర్షాల వల్ల ఆరుగురు మృతి చెందారని వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి నాలుగు […]
Advertisement
అకాల వర్షాల కారణంగా తెలంగాణలో మృత్యువాత పడ్డ బాధితులకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఈ పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. జిల్లాల వారీగా పంట, ఆస్తి నష్టం వివరాలను వెంటనే సేకరించి తెలియజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా ఎపీలో అకాల వర్షాల వల్ల ఆరుగురు మృతి చెందారని వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సుమారు 3500 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని ఆయన తెలిపారు. పంట, ఆస్తి నష్టపోయిన వారిని కూడా ఆదుకుంటామని ఆయన అన్నారు.-పీఆర్
Advertisement