ఆసియాపై పెత్తనానికి చైనా తహతహ: ఒబామా
ఆసియా ఖండంలోని చిన్న దేశాలపై ఆర్ధిక బలంతో చైనా పెత్తనం చేయడానికి తహతహలాడుతుందని, ఇది ఆ ప్రాంతానికి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఇది చాలా చెడు ప్రభావాలకు దారి తీస్తుందని అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా తీరుపై మండిపడ్డారు. పనామాలో జరగనున్న కరేబియన్ సదస్సులో పాల్గొనేందుకు ఒబామా జమైకా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ సముద్రంలోని అధిక భాగాన్ని చైనా తనదని చెప్పుకుంటోందని, దీనివల్ల ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర […]
Advertisement
ఆసియా ఖండంలోని చిన్న దేశాలపై ఆర్ధిక బలంతో చైనా పెత్తనం చేయడానికి తహతహలాడుతుందని, ఇది ఆ ప్రాంతానికి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఇది చాలా చెడు ప్రభావాలకు దారి తీస్తుందని అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా తీరుపై మండిపడ్డారు. పనామాలో జరగనున్న కరేబియన్ సదస్సులో పాల్గొనేందుకు ఒబామా జమైకా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ సముద్రంలోని అధిక భాగాన్ని చైనా తనదని చెప్పుకుంటోందని, దీనివల్ల ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర దేశాలు ఆ ప్రాంతంలో తమకున్నసార్వభౌమాధికారం కోల్పోతాయని, ఇలాంటి పనులు చైనా మానుకోవాలని హితవు చెప్పారు. ప్రపంచమంతా సామరస్యంగా ఉండాలని భావిస్తుంటే చైనా ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదని ఒబామా మండిపడ్డారు. దీనివల్ల భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.-పీఆర్
Advertisement