ఆమె పక్కనా...నేను కూర్చోను!
ఫ్రాన్సిస్కాహోగీ అనే నలభై సంవత్సరాల మహిళ ఇటీవల న్యూయార్క్ నుండి లండన్ ప్రయాణిస్తున్నారు. ఆమె తన సీట్లో కూర్చున్నారు. ఇంతలో ఆమె పక్కన ఉన్న విండో సీటు వ్యక్తి వచ్చాడు. అతను ఫ్రాన్సిస్కా పక్క సీట్లో కూర్చోవాల్సి ఉండగా అందుకు తిరస్కరించాడు. ఒక పరాయి మహిళ పక్కన కూర్చునేందుకు తమ మతం తనని అనుమతించదంటూ, ఎలాగైనా ఆమె సీటు మార్చాలంటూ విమాన సిబ్బందితో మొండిగా వాదించాడు. తాను మహిళ అవటం వలన తన సీటు వదిలి మరొక […]
Advertisement
ఫ్రాన్సిస్కాహోగీ అనే నలభై సంవత్సరాల మహిళ ఇటీవల న్యూయార్క్ నుండి లండన్ ప్రయాణిస్తున్నారు. ఆమె తన సీట్లో కూర్చున్నారు. ఇంతలో ఆమె పక్కన ఉన్న విండో సీటు వ్యక్తి వచ్చాడు. అతను ఫ్రాన్సిస్కా పక్క సీట్లో కూర్చోవాల్సి ఉండగా అందుకు తిరస్కరించాడు. ఒక పరాయి మహిళ పక్కన కూర్చునేందుకు తమ మతం తనని అనుమతించదంటూ, ఎలాగైనా ఆమె సీటు మార్చాలంటూ విమాన సిబ్బందితో మొండిగా వాదించాడు. తాను మహిళ అవటం వలన తన సీటు వదిలి మరొక సీటులో సర్దుకుపోవాల్సి రావటంతో ఆమె ఖిన్నురాలైంది. ఇష్ట్టం లేకపోయినా విమానంలో వివాదం పెంచలేక వేరే సీటుకి మారిపోయింది. న్యూయార్క్ మీదుగా శాండియాగో నుండి లండన్ వెళుతున్న లారా అనే మహిళకు సైతం సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మధ్య సీటులో లారా ఈ చివర సీటులో ఆమె భర్త కూర్చోవాల్సి ఉండగా, విండోసీట్లో ఆమె పక్కన కూర్చోలేనని ఒక అపరిచిత వ్యక్తి మొండికేయటంతో లారా, ఆమె భర్త సీట్లు మార్చుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోనే కాదు, అమెరికానుండి ఇజ్రాయిల్ వెళుతున్న చాలా విమానాల్లో ఇటీవల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సనాతన యూదు జాతికి చెందిన మగవారు పరాయి మహిళ పక్కన కూర్చోరాదనే తమ మత నిబంధనను పాటిస్తూ ఇలా విమానాల్లో వివాదాలు సృష్టిస్తున్నారు.
ఈ కారణంగా అమెరికా నుండి ఇజ్రాయిల్ వెళుతున్న విమానాలు చాలా సందర్భాల్లో ఆలస్యంగా నడిచాయని నమోదిత వివరాలు చెబుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో మహిళ సర్దుకుపోయి తన సీటు మారే వరకు విమానంలో టెన్షన్ క్రియేట్ అవుతోందని, తన ప్రయాణంలో ఎదురైన ఇలాంటి సంఘటన కారణంగా దాదాపు ఐదునుండి ఎనిమిది నిముషాల పాటు అంతా ఉత్కంఠగా ఎదురుచూశామని జెర్మరీ న్యూ బర్గర్ అనే డాక్యుమెంటరీ రూపకర్త తెలిపారు. తాను యూదు మత మద్ధతుదారుడినే అయినా ఇవి చాలా చిరాకు పెట్టే సందర్భాలుగా అతను పేర్కొన్నాడు. యూదులు తమ భార్యకాని మహిళతో సన్నిహిత సంబంధం కలిగి ఉండరాదనే నిబంధన ఉన్నా, ప్రముఖ సనాతన యూదు మత స్కాలర్ రబ్బీమోస్ట్ ఫెయిన్‌స్టైన్ చెప్పినట్టుగా ఎలాంటి చెడు భావన లేకుండా పరాయి మహిళల పక్కన కూర్చుని ప్రయాణం చేయడం తప్పుకాదని ఒక యూదు మతస్తుడు పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో మహిళలు సర్దుకుపోతుండటం వలన ప్రయాణాలు సజావుగా సాగుతున్నాయని… కొన్నిసార్లు చాలా ఆటంకంగా మారుతున్నాయని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయిల్ నుండి తమ కుటుంబాలతో కలిసి ప్రయాణించే యూదుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ వివాద సందర్భాల్లో వారిదే పైచేయి అవుతోందని కొన్ని విమాన సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
Advertisement