జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ సత్తా
హైదరాబాద్: పంజాబ్‌లో జరిగిన 58వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ సత్తా చాటారు. వివిధ విభాగాల్లో మూడు రజత, ఐదు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్, కంప్యూటర్ అవేర్‌నెస్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ విభాగాల్లో ఇన్‌స్పెక్టర్ యం. శ్రీధర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసరెడ్డి, వివేకానంద్ రజత పతకాలు సాధించారు. సైంటిఫిక్ ఎయిడ్స్, ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో ఎస్సై క్రాంతి కుమార్, చతుర్వేది, అశిష్‌రెడ్డి, మహిళా హెడ్‌కానిస్టేబుల్ సుమతి రెడ్డి, కానిస్టేబుల్ రమణ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. దీంతోపాటు సైంటిఫిక్ […]
Advertisement
హైదరాబాద్: పంజాబ్‌లో జరిగిన 58వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ సత్తా చాటారు. వివిధ విభాగాల్లో మూడు రజత, ఐదు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్, కంప్యూటర్ అవేర్‌నెస్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ విభాగాల్లో ఇన్‌స్పెక్టర్ యం. శ్రీధర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసరెడ్డి, వివేకానంద్ రజత పతకాలు సాధించారు. సైంటిఫిక్ ఎయిడ్స్, ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో ఎస్సై క్రాంతి కుమార్, చతుర్వేది, అశిష్‌రెడ్డి, మహిళా హెడ్‌కానిస్టేబుల్ సుమతి రెడ్డి, కానిస్టేబుల్ రమణ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. దీంతోపాటు సైంటిఫిక్ ఎయిడ్స్, ఇన్వెస్టిగేషన్ విభాగం ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ పోలీసులు
మూడోస్థానంలో నిలిచారు. పతకాలు సాధించిన పోలీసులకు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటివి మరిన్ని పోలీసుశాఖకు సంపాదించి వన్నె తేవాలని కోరారు.-పిఆర్
Advertisement