మా’ ఫలితాల‌కు కోర్టు బ్రేక్‌

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫ‌లితాల విడుద‌ల‌కు మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నెల 28న  ‘మా’ ఎన్నిక‌లు కోర్టు కనుసన్నల్లో జరిగిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేర‌కు ఎన్నికల జరిగిన తీరును వీడియో కూడా చేశారు. ఈ నేపథ్యంలో ‘మా’  ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ విచారణను కోర్టు ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి ఈరోజు (మంగ‌ళ‌వారం) కోర్టు తీర్పు వ‌స్తుంద‌ని, లెక్కింపు జ‌రిపి ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌కు అవ‌కాశం […]

Advertisement
Update:2015-03-31 11:10 IST
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫ‌లితాల విడుద‌ల‌కు మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నెల 28న ‘మా’ ఎన్నిక‌లు కోర్టు కనుసన్నల్లో జరిగిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేర‌కు ఎన్నికల జరిగిన తీరును వీడియో కూడా చేశారు. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ విచారణను కోర్టు ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి ఈరోజు (మంగ‌ళ‌వారం) కోర్టు తీర్పు వ‌స్తుంద‌ని, లెక్కింపు జ‌రిపి ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌కు అవ‌కాశం ఉంద‌ని అంద‌రూ భావించారు. కాని కోర్టు ఈ కేసును ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేయ‌డంతో ‘మా’ విజేత ఎవరో తేలే అవకాశం లేకుండా పోయింది. ‘మా’ ఎన్నికల పోలింగ్‌ వీడియో సీడీలను ఏప్రిల్‌ ఏడో తేదీన కోర్టుకు సమర్పించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. మరి ఏప్రిల్ 7వ తేదీన ఈ కేసుపై ఎలాంటి తీర్పు వ‌స్తుందో ఒక‌వేళ ఆరోజు కూడా రాక‌పోతే ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.-పిఆర్‌
Tags:    
Advertisement

Similar News