అలక వీడిన భట్టి.. ఆ పని చేస్తారా?

ఇవాళ ఖమ్మం బాట పట్టారు భట్టి విక్రమార్క. ఆయన వెంట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోట్ల నాగేశ్వర్ రావు కూడా ఉన్నారు. నాగేశ్వర్‌రావు చేత నామినేషన్ విత్‌డ్రా చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
Update:2024-04-29 14:31 IST

భార్య నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వలేదని డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క అలకబూనారు. మంత్రి పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డికి టికెట్ ప్రకటించిన రోజునుంచి ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ఏం చేయబోతున్నారు అనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ర‌ఘురామిరెడ్డి మంత్రి పొంగులేటితో కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, భట్టి దూరంగా ఉండటంతో ఇప్పటి వరకు భట్టి సొంత నియోజకవర్గం మధిరలో ప్రచారం నిర్వహించలేదు.

ఈ నేపథ్యంలో ఇవాళ ఖమ్మం బాట పట్టారు భట్టి విక్రమార్క. ఆయన వెంట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోట్ల నాగేశ్వర్ రావు కూడా ఉన్నారు. నాగేశ్వర్‌రావు చేత నామినేషన్ విత్‌డ్రా చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు భట్టి విక్రమార్క. కానీ, రఘురామిరెడ్డి కోసం ప్రచారం చేస్తారా లేదా ఆయన గెలుపున‌కు సహకరిస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకుని పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. కానీ భట్టి అలకతో అగ్రనేతల మధ్య మరింత గ్యాప్ పెరిగింది. తాజా పరిస్థితులతో కాంగ్రెస్ క్యాడర్‌లో గందరగోళం నెలకొంది.

Tags:    
Advertisement

Similar News