ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ వెనకడుగు ఎందుకు : కృష్ణ మాదిగ

సుప్రీం కోర్టు ఆగస్ట్ 1వ తేదీన ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు.

Advertisement
Update:2024-10-03 18:09 IST

అత్యుత్తన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ ఉప వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభత్వానికి ఉందని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. సుప్రీం కోర్టులో ఆగస్ట్ 1న తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారని.. . అందరికన్నా ముందు రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పేరని కృష్ణ మాదిగ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత డీఎస్సీ పరీక్షలు జరిగాయని చెప్పారు.

డీఎస్సీ ఫలితాలు ప్రకటించారని.. వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు నిర్లక్ష్యం చేూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చట్ట సభలో ఇచ్చిన మాటకి విరుద్ధంగా చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం తీర్పు అనంతరం పంజాబ్ , తమిళనాడు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కమిటీ వేసి నివేదిక అనంతరం అమలు చేస్తామని సీఎం చెప్పారని .. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఒత్తిడి ఒకవైపు , ఇంకోవైపు రాష్ట్రంలో మాలల ఒత్తిడి వల్ల వర్గీకరణ అమల్లో వెనుకాడరని అన్నారు. 9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో అన్ని జిల్లాలో నిరసన తెలపాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News