గుండెపోట్ల‌తో హఠాన్మరణాలకు కారణం ఉప్పే ‍-WHO నివేదిక

WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఉప్పు అధికంగా వాడడం వల్లే గుండెపోట్లు వస్తున్నాయి. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO సోడియం (ఉప్పు) మోతాదు హెచ్చితే అనారోగ్య సమస్యలు వస్తాయని తాము ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ అనేక దేశాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడ‍ం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement
Update:2023-03-10 21:40 IST

ఇటీవల తెలంగాణలో గుండెపోట్ల‌తో మరణాలు పెరిగిపోతున్నాయి. గుండె పోటుతో వారంరోజుల్లో ఆరుగురు మరణించారు. మరణించిన వారిలో యువకులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఏదో ఒక దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరిగిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ నివేదికను విడుదల చేసింది.

WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఉప్పు అధికంగా వాడడం వల్లే గుండెపోట్లు వస్తున్నాయి. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO సోడియం (ఉప్పు) మోతాదు హెచ్చితే అనారోగ్య సమస్యలు వస్తాయని తాము ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ అనేక దేశాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడ‍ం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 2025 నాటికి ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలని పెట్టుకున్న‌ లక్ష్యం ఆచరణలో కనిపించడంలేదని డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తం చేసింది. ప్రపంచంలోని కేవలం 9 దేశాలు మాత్రమే సోడియం వాడకాన్ని తగ్గించాయని WHO నివేదిక పేర్కొంది.

మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా... ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయని WHO నివేదిక చెబుతోంది. ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది.

తాము నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని, కానీ, అందుకు విరుద్ధంగా ప్రపంచంలో సగటున 10.8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నట్టు WHO నివేదిక పేర్కొంది. 

Tags:    
Advertisement

Similar News