సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నీటి కొరత

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నీటి కొరతతో రోగుల తీవ్ర అవస్థలు పడుతున్నారు.మెయిన్ మోటార్ చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని సిబ్బంది చెబుతున్నారు.

Advertisement
Update:2024-10-21 15:47 IST

తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద సర్కార్ హాస్పిటల్ సికింద్రాబాద్ గాంధీ. నిన్నటి నుంచి తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో రోగులు, వారి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ మోటార్ చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. ఆస్పుపత్రి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో బయట నుంచి వాటర్ బాటిళ్లు కొనుక్కుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా గాంధీ ఆసుపత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కూడా ఆసుపత్రి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. వీటిన్నింటినీ అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేయాలని అసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. సరిపడా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, తదితర సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News