రాజకీయాలకు విజయశాంతి గుడ్‌బై..?

పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. విజయశాంతి ఇప్పటివరకూ ఏ అధికారిక కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. చివరగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజు కనిపించారు.

Advertisement
Update:2024-03-21 11:33 IST

మాజీ ఎంపీ, సీనియర్ లీడర్‌ విజయశాంతి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారా..? అవును.. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌లో చేరిన లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. విజయశాంతి ఇప్పటివరకూ ఏ అధికారిక కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. చివరగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజు కనిపించారు. తర్వాతి నుంచి పార్టీకీ దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకూ నాలుగు గ్యారంటీలను ప్రారంభించినప్పటికీ.. ఏ పథకం ప్రారంభోత్సవంలోనూ విజయశాంతి పాల్గొనలేదు. గాంధీభవన్‌కు సైతం ఆమె దూరంగా ఉంటున్నారు.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొన్న వేళ విజయశాంతి కనిపించకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. మెదక్‌ పార్లమెంట్‌ సీటు హామీతోనే విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారన్న చర్చ జరిగింది. అయినప్పటికీ.. పార్లమెంట్ అభ్యర్థులపై కాంగ్రెస్‌ కసరత్తు చేస్తున్నప్పటికీ.. విజయశాంతి కనిపించకపోవడం, ఆమె పేరు కూడా ప్ర‌స్తావ‌న‌లోకి రాక‌పోవ‌డం చర్చనీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News