కాంగ్రెస్‌ అధికార ప్రతినిధికి వీసీ పోస్టు

వీసీ నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండదు అన్నదన్నది ఉత్త మాటేనని తేలింది

Advertisement
Update:2024-10-18 15:38 IST

వర్సిటీలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, వీసీ నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని ప్రస్తుత రేవంత్‌ రెడ్డి పెద్ద పెద్ద ప్రసంగాలు దంచారు. కానీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులైన ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ వీసీగా నియమితులయ్యారు. సెర్చ్‌ కమిటీ కమిటీలు ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపారు. గత ప్రభుత్వ హయాంలో వీసీల నియామకంలో సరిగా జరగలేదన్న ఆరోపించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఏకంగా తమ పార్టీ అధికార ప్రతినిధికి వీసీ పోస్టు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీలు వీళ్లే

 రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్స్‌లర్లను గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ కుమార్‌ మొగులారం, కాకతీయ వర్సిటీకి ప్రొఫెసర్‌ ప్రతాపరెడ్డి, పాలమూరు వర్సిటీకి ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌, శాతవాహన యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ ఉమేశ్‌కుమార్‌, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌, శ్రీ కొండా లక్షణ్‌ హార్టీ కల్చర్‌ వర్సిటీకి ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, తెలుగు వర్సిటీకి నిత్యానంద రావు, తెలంగాణ యూనివర్సిటికి ప్రొఫెసర్‌ యాదగిరి రావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీకి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యలను వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

Tags:    
Advertisement

Similar News