హరీష్‌ రావుపై బండి ప్రశంసలు.. కారణం అదేనా?

బీఆర్ఎస్‌ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే బండి సంజయ్‌ హరీష్‌ రావుపై ప్రశంసలు తెలుస్తోంది స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న క్రమంలో బండి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement
Update:2024-07-15 09:24 IST

మాజీ మంత్రి హరీష్‌ రావును కేంద్రమంత్రి, బీజేపీ మాజీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రశంసించారు. బీఆర్ఎస్‌లో హరీష్‌ రావు ఒక్కరే మంచి రాజకీయ నాయకుడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. హరీష్‌కు ఉద్యమకారుడిగా గుర్తింపుతో పాటు మంచిగా పనిచేస్తారన్న పేరు ఉందన్నారు. బీజేపీలో చేరాలనుకున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనన్నారు. హరీష్‌ రావు రావాలనుకున్న రాజీనామా చేసి రావాల్సిందేనన్నారు బండి సంజయ్‌.

ఇక గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్, బీజేపీ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారంపైనా క్లారిటీ ఇచ్చారు బండి. అలాంటి ప్రతిపాదనేమి లేదన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ చేస్తున్న ఫేక్ ప్రచారం మాత్రమేనన్నారు. తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలిచిందని.. బీఆర్ఎస్ ఎక్కడుందన్నారు బండి.

బీఆర్ఎస్‌ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే బండి సంజయ్‌ హరీష్‌ రావుపై ప్రశంసలు తెలుస్తోంది స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న క్రమంలో బండి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు కాంగ్రెస్‌ నేతలు సైతం హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ మార్పుపై గతంలోనే హరీష్‌ రావు చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఏ నాయకుడికైనా ఆత్మాభిమానం ముఖ్యమని, తాను పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసే వారికి లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News