వాళ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట సభలో అమిత్‌షా మాట్లాడారు. తెలంగాణలో కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను కోరారు.
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తామన్నారు కేంద్రం హోంమంత్రి అమిత్‌షా. ముస్లిం రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని.. ఆ రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీ , ఓబీసీలకు ఇస్తామన్నారు. తెలంగాణలో ఉన్న 4% ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని ఇప్పటికే బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట సభలో అమిత్‌షా మాట్లాడారు. తెలంగాణలో కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు అమిత్‌షా.
అమిత్‌షాకు నిరసన సెగ..
సిద్దిపేట బహిరంగ సభలో అమిత్‌షాకు నిరసన సెగ తగిలింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు. సహారా పేమెంట్స్ చెల్లించాలని బాధితులు నిరసన తెలిపారు.