టీవీ సీరియల్ నటుడి ఆత్మహత్యలో ట్విస్ట్.. చందు మృతికి కారణం అదేనా..!

రోజూ ఆమెను తలుచుకుంటూ ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతూ వచ్చాడు. పవిత్రలేని లోకంలో తాను ఉండలేనని, ఆమె వద్దకు వెళ్లడమే కరెక్ట్ అని చందు తన సన్నిహితుల వద్ద బాధపడగా వారు వారించినట్లు తెలుస్తోంది

Advertisement
Update:2024-05-18 11:34 IST

బుల్లితెర ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. త్రినయని సీరియల్‌లో నటిస్తున్న పవిత్ర ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే అదే సీరియల్లో నటిస్తున్న మరో నటుడు చందు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే పవిత్ర మృతిని తట్టుకోలేకే చందు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

పవిత్రకు భర్త ఇద్దరు పిల్లలు ఉండగా.. కొన్నేళ్ల కిందటే ఆమె భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. అతడికి పవిత్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత ఆరేళ్లుగా చందు, పవిత్ర సహజీవనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవిత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చందు తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్ లోకి వెళ్ళాడు.

రోజూ ఆమెను తలుచుకుంటూ ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతూ వచ్చాడు. పవిత్రలేని లోకంలో తాను ఉండలేనని, ఆమె వద్దకు వెళ్లడమే కరెక్ట్ అని చందు తన సన్నిహితుల వద్ద బాధపడగా వారు వారించినట్లు తెలుస్తోంది. సన్నిహితులు వారించినప్పటికీ చందు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుని నిన్న హైదరాబాద్ మణికొండలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News