రాష్ట్రంలో13 మంది ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Update:2024-10-28 20:04 IST

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి, నల్గొండ కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా హనుమంతరావు, పురపాలకశాఖ డైరెక్టర్‌గా టి.కె. శ్రీదేవిని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా మందా మ‌క‌రందు, ప‌ర్యాట‌క శాఖ సంచాల‌కులుగా జెడ్ కే హ‌నుమంతు, దేవాదాయ శాఖ సంచాలకులుగా హ‌నుమంత‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఐ అండ్ పీఆర్ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్‌గా ఎస్ హ‌రీశ్‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి హ‌రీశ్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఆర్ అండ్ ఆర్, భూసేక‌ర‌ణ క‌మిష‌న‌ర్‌గా విన‌య్ కృష్ణా రెడ్డి, వాణిజ్య ప‌న్నుల శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్‌గా నిఖిల్ చ‌క్ర‌వర్తికి అద‌న‌పు బాధ్య‌త‌లు, డెయిరీ కార్పొరేష‌న్ ఎండీగా కే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ఎస్ దిలీప్ కుమార్ నియ‌మితుల‌య్యారు.

 క్రీడాశాఖ డైరెక్టర్‌గా సోని బాలాదేవీ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా కొర్రా లక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా ఎన్. క్షితిజ, జీహెచ్‌ఎంసీ అర్బన్ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్‌గా సుభద్రాదేవీ, వికారాబాద్ డీఎఫ్‌గా జి.జ్ఞానేశ్వర్‌లకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News