రేవంత్ ఇలా అన్నాడేంటి..?

2004 ఎన్నికలకు ముందు చంద్రబాబును మీడియా ఆకాశానికి ఎత్తేసిందని.. అయినప్పటికీ ప్రజలు వైఎస్సార్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీనే గెలిపించారని చెప్పారు.

Advertisement
Update:2023-01-04 19:19 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత అభిమానం ఉంటుందో తెలియదు కానీ.. టీడీపీ వాళ్లు మాత్రం ఆయనను బాగా ఆదరిస్తారు. ఇక టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా కూడా రేవంత్ ను తెగ హైలైట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా టీడీపీని గానీ.. చంద్రబాబును గానీ పల్లెత్తు మాట అనకుండా స్వామిభక్తిని ప్రదర్శించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.

ఆయన తెలుగుదేశం అనుకూల మీడియాను, చంద్రబాబును విమర్శిస్తూ తొలిసారిగా మాట్లాడారు. ఇవాళ హైద‌రాబాద్ లోని బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో ఓ స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబును మీడియా ఆకాశానికి ఎత్తేసిందని.. అయినప్పటికీ ప్రజలు వైఎస్సార్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీనే గెలిపించారని చెప్పారు. సరిగ్గా ఇప్పుడు కూడా.. మీడియా ఎవరికెంత హైప్ ఇచ్చినా.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని చెప్పుకున్నారు. పనిలోపనిగా రాజశేఖర్ రెడ్డిని కూడా పొగిడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రేవంత్ కు చంద్రబాబు మనిషిగా ముద్ర ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోని హార్డ్ కోర్ వైఎస్ ఫ్యాన్స్ ఆయనను పూర్తిస్థాయిలో ఆదరించే పరిస్థితి లేదు. ప్రస్తుతం షర్మిల కూడా పార్టీ పెట్టారు. చాలా తక్కువ మంది వైఎస్ అభిమానులు ఆమె వెంట ఉన్నారు. అయితే రేవంత్ మాత్రం.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ అభిమానులను తన వైపునకు పూర్తి స్థాయిలో తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా తన మీద పడ్డ ముద్రను కూడా తొలిగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఆయన అప్పుడప్పుడూ రాజశేఖర్ రెడ్డిని పొగుడుతుంటారు.

తాజాగా పచ్చ మీడియాను ఆయన టార్గెట్ చేయడం గమనార్హం. నిజానికి రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక.. పచ్చ మీడియా తెగ సంబరపడిపోయింది. ఎందుకంటే చంద్రబాబు సంతోషమే వారి సంతోషం కదా.. ఇదిలా ఉంటే తాజాగా రేవంత్ ఆ మీడియానే విమర్శించారు. మరి ఇదంతా డ్రామాలో భాగమేనా..? రేవంత్ మనసులోని అంతరార్థం ఆ మీడియాకు కూడా తెలుసేమో తెలియదు. మొత్తానికి అంతర్గత కుమ్ములాటలతో అట్టుడుకుతున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి విజయతీరాలకు ఎలా చేరుస్తాడో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News