తుల ఉమ.. ఇంకా ఎందుకీ డైలమా..?

బీజేపీలో కూడా దొరల వల్లే తనకు టికెట్ రాలేదని, బండి సంజయ్, దొరల కాళ్ళ దగ్గర బీ ఫామ్ పెట్టి వచ్చారని అన్నారు. కానీ తాను మాత్రం దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేనన్నారు. బీసీ ముఖ్యమంత్రి అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం బూటకం అన్నారు తుల ఉమ.

Advertisement
Update:2023-11-12 15:42 IST

లిస్ట్ లో పేరున్నా కూడా బీ ఫామ్ దక్కించుకోలేక బీజేపీలో అవమానాలపాలైన బీసీ బిడ్డ తుల ఉమ.. తానింకా ఏ పార్టీలో చేరలేదని, ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని చెబుతున్నారు. తాను బీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని మీడియాలో వస్తున్న వార్తల్ని ఆమె ఖండించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అని చెప్పారు. దాదాపుగా ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయమనుకుంటున్న వేళ, సడన్ గా ఈ ప్రెస్ మీట్ ఎందుకో అర్థం కేవడంలేదు. వేములవాడ ప్రజల అభీష్టం మేరకే తాను నిర్ణయం తీసుకుంటానన్నారు తుల ఉమ.

పోటీలో ఉంటారా..?

ప్రస్తుతం తుల ఉమ వేములవాడ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ బీ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి ఆమెకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈసీ గుర్తు కేటాయిస్తుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి, తన సత్తా చూపించి, పరోక్షంగా బీజేపీ అభ్యర్థి ఓటమికి కారణమై.. ఆ తర్వాత ఆమె పార్టీ మారతారేమోననే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ లో చేరితే, కచ్చితంగా తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది, బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలంటూ తన అనుచరులకు చెప్పాల్సి ఉంటుంది. పోటీ నుంచి విరమించుకోవడం ఇష్టంలేని ఉమ.. ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోవచ్చనే వార్తలు కూడా వినపడుతున్నాయి.

మొత్తానికి తుల ఉమ మాత్రం.. పార్టీ మార్పు వార్తల్ని ఖండించారు. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలందాయని చెబుతున్న ఆమె, ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. తన ఒక్క దాని కోసం నిర్ణయం తీసుకోను అని, తనను నమ్ముకున్న ప్రజలందరి కోసం నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పటికే చాలా నష్టపోయానని, మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదన్నారు ఉమ. ఇప్పుడు తీసుకొనే నిర్ణయం అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో కూడా ఓ దొర అహంకారంతోనే తాను బయటకు వచ్చానన్నారు ఉమ. బీజేపీలో కూడా దొరల వల్లే తనకు టికెట్ రాలేదని, బండి సంజయ్, దొరల కాళ్ళ దగ్గర బీ ఫామ్ పెట్టి వచ్చారని అన్నారు. కానీ తాను మాత్రం దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేనన్నారు. బీసీ ముఖ్యమంత్రి అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం బూటకం అన్నారు తుల ఉమ. 


Tags:    
Advertisement

Similar News