ఈ సారి రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు...వ్యవసాయం, సంక్షేమానికి పెద్ద పీట‌

బడ్జెట్ పై మంత్రి వర్గం చర్చించి ఏ రంగానికి ఎంత కేటాయించాలనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సారి బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటుందని సమాచారం. ప్రధానంగా రైతుల సంక్షేమం, వ్యవ‌సాయ అభివృద్ది, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, గృహ నిర్మాణాలకు ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Advertisement
Update:2023-02-05 10:19 IST

ఈరోజు ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివర్గం భేటీకానుంది. ఈ నెల 6వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశ‍లో మంత్రివర్గం చర్చించి బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది.

బడ్జెట్ పై మంత్రి వర్గం చర్చించి ఏ రంగానికి ఎంత కేటాయించాలనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సారి బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటుందని సమాచారం. ప్రధానంగా రైతుల సంక్షేమం, వ్యవ‌సాయ అభివృద్ది, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, గృహ నిర్మాణాలకు ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది.

రైతులకు ఉచిత విద్యుత్తు, దళిత బంధు, రైతుబంధు కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవనున్నట్టు సమాచారం. ఈ మూడు పథకాలకే రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ కేటాయిం పులు

కావాలని అధికారుల నుండి ప్రతిపాదనలు అందాయి.

రైతుల రుణమాఫీ కి కూడా ఈ సారి అధిక నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఇంటి జాగా ఉన్నవాళ్ళకు ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం పథకాన్ని కూడా ఈ బడ్జెట్ లో చేర్చే అవకాశం ఉంది.

మంత్రివర్గం సమావేశం తర్వాత కేసీఆర్ మహారాష్ట్ర లోని నాందేడ్ లో జరగనున్న భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు హాజరయ్యేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ వెళ్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సచ్‌ఖండ్‌బోడ్‌ మైదానంలో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడుతారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు.

Tags:    
Advertisement

Similar News