TG 09 A 9999 నంబర్‌కు రూ. 19 లక్షలు.. ఎవ‌రు కొన్నారో తెలుసా?

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ RTO వేలంలో TG 09 A 9999 నంబర్‌కు ఏకంగా 19 లక్షల 51వేల 111 రూపాయలు ధర పలికింది.

Advertisement
Update: 2024-07-25 06:23 GMT

ఫ్యాన్సీ నంబర్లకు జనాల్లో ఉండే క్రేజే వేరు. ఫోన్ నంబర్లు, వాహనాల నంబర్ ప్లేట్లలో ఫ్యాన్సీ నంబర్‌ కోసం జనం పోటీ పడుతుంటారు. ఇంకొందరేమో తమ పుట్టిన రోజు, పెళ్లి రోజు, లేదా తమ లక్కీ నంబర్ ఫ్యాన్సీలో ఉండేలా చూసుకుంటారు. ఫ్యాన్సీ నంబర్‌ దక్కాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరు ఎంత ఖర్చయినా అనుకున్న నంబర్‌నే దక్కించుకుంటారు.

ఫాన్సీ నంబర్లపై తెలంగాణ వాహన యాజమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతోంది. తమకు ఇష్టమైన, అచ్చొచ్చే నంబర్లను దక్కించుకోవడానికి ఎంత చెల్లించడానికైన వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ RTO వేలంలో TG 09 A 9999 నంబర్‌కు ఏకంగా 19 లక్షల 51వేల 111 రూపాయలు ధర పలికింది. హానర్స్‌ డెవలపర్స్‌ అనే సంస్థ ఈ నంబర్‌ను సొంతం చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన TG 09 B 0001 నంబర్‌ను 8లక్షల 25 వేలు చెల్లించి NG మైంజ్‌ ఫ్రేమ్‌ సంస్థ దక్కించుకుంది. అదే సిరీస్‌లోని 0009 నంబర్‌ను 6లక్షల 66వేల 666 రూపాయలు చెల్లించి అమరం అక్షరరెడ్డి సొంతం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News