ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ పలువురు రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
Advertisement
ఫార్మావిలేజ్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. దుద్యాల మండలం రోటిబండతండాలో ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా స్థానికులు ధర్నా చేపట్టారు. ఫార్మా విలేజ్ ఏర్పాటునకు మద్దతు ఇస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవిటి శేఖర్ కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ పలువురు రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనం వద్ద పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల ఆందోళనతో ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది.
Advertisement