తెలంగాణ మరో రికార్డు: డిమాండ్ కన్నా మూడు రెట్ల పండ్ల‌ ఉత్పత్తి - ఎగుమతులే లక్ష్యం

గతంలో రాష్ట్రానికి అవసరమైన 7.34 లక్షల మెట్రిక్ టన్నుల పండ్ల ఉత్పత్తిని కూడా రీచ్ కాలేక పోయిన తెలంగాణ నేడు 24.78 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో పండ్ల మిగులు రాష్ట్రంగా ఉంది. మామిడి, జామ, బొప్పాయి, పుచ్చకాయలతో సహా అనేక రకాల పండ్ల‌ ఉత్పత్తిలో అనేక రాష్ట్రాలను వెనక్కి నెట్టేసింది తెలంగాణ‌.

Advertisement
Update: 2022-12-05 06:55 GMT

అనేక రంగాల్లో వడి వడిగా అడుగులు వేస్తూ దేశంలోని అనేక పెద్ద రాష్ట్రాలను కూడా అధిగమిస్తోన్న తెలంగాణ మరో ఘనత సాధించింది. పండ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. గతంలో రాష్ట్రానికి అవసరమైన 7.34 లక్షల మెట్రిక్ టన్నుల పండ్ల ఉత్పత్తిని కూడా రీచ్ కాలేక పోయిన తెలంగాణ నేడు 24.78 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో పండ్ల మిగులు రాష్ట్రంగా ఉంది. మామిడి, జామ, బొప్పాయి, పుచ్చకాయలతో సహా అనేక రకాల పండ్ల‌ ఉత్పత్తిలో అనేక రాష్ట్రాలను వెనక్కి నెట్టేసింది తెలంగాణ‌.

రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారుల ప్రకారం, రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న‌ 14 పండ్లలో, ఎనిమిది పండ్లు.. మామిడి, జామ, బొప్పాయి, సీతాఫలం, పుచ్చకాయ, సపోటా, స్వీట్ ఆరెంజ్, నిమ్మ‌ ఉత్పత్తిలో మిగులు ఉండగా, ఆరు పండ్లలో - ద్రాక్ష, ఆపిల్. , జామున్, అరటి, పైనాపిల్ , దానిమ్మ - ఉత్పత్తిలో లోటు ఉంది.

మామిడి మొత్తం ఉత్పత్తి 10.23 లక్షల మెట్రిక్‌ టన్నులుండగా రాష్ట్ర మామిడి వినియోగం 0.19 లక్షల మెట్రిక్‌ టన్నులు. రాష్ట్రంలో 10.04 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి మిగులు ఉత్పత్తి జరిగింది. వాస్తవానికి, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిలో 98.15 శాతం ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేయబడింది. అదేవిధంగా, రాష్ట్రంలో 4.83 లక్షల నారింజ‌,నిమ్మ‌ మిగులు ఉత్పత్తి ఉంది. రాష్ట్రంలో ఏటా రూ.725 కోట్ల విలువైన నారింజ, నిమ్మ‌ పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు అంచనా.

అయితే, కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రం ఇంకా స్వయం సమృద్ధి సాధించలేదు. తెలంగాణలో కూరగాయల డిమాండ్, సరఫరా మధ్య 9.65 లక్షల మెట్రిక్ టన్నుల అంతరం ఉంది, దీని కారణంగా పొరుగు రాష్ట్రాల నుండి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కూరగాయల అవసరం ఏడాదికి 26.09 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ప్రస్తుతం ఉత్పత్తి 16.44 లక్షల మెట్రిక్‌ టన్నులుంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో రోజుకు సగటున 2006 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం హైదరాబాద్‌కు గ్రామీణ‌ ప్రాంతాలు, పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తున్నాయి. నగరానికి పొరుగు జిల్లాలైన రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీష్‌గఢ్, న్యూఢిల్లీ నుండి కూడా కూరగాయలు వస్తాయి.

జీడిమెట్లలో 10.35 ఎకరాల్లో కూరగాయలు, పూల ఉత్పత్తి, సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో 50 ఎకరాల్లో పండ్ల కోసం సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

కూరగాయల ఉత్పత్తి కొరతతో పాటు, వ్యర్థాల సమస్య కూడా తెలంగాణలో ఆందోళన కలిగించే అంశం. హార్టికల్చర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్లకు తీసుకొచ్చే పండ్లు, కూరగాయల్లో 30 శాతం కుళ్లిపోతున్నాయి. రాష్ట్రంలో శీతల గిడ్డంగుల కొరత సమస్యగా ఉన్నది.

ఒక వైపు పండ్లు, కూర గాయల ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలు కొనసాగిస్తూనే , వాటిని నిలువ చేయడానికి అవసరమైన శీతల గిడ్డంగుల ఏర్పాటు పై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి‍ంది. త్వరలోనే ఆ సమస్యలు కూడా తీరిపోతాయని అధికారులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News